Sangeetha: రెండు రోజులు షూట్‌లో పాల్గొన్నా.. సినిమా నుంచి తీసేశారు: సంగీత

తానొక సినిమా చిత్రీకరణలో రెండు రోజులు పాల్గొన్నా.. దాన్నుంచి తొలగించారని సంగీత తెలిపారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో నాటి సంగతులను ఆమె గుర్తుచేసుకున్నారు.

Published : 07 Sep 2022 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తానొక సినిమా చిత్రీకరణలో రెండు రోజులు పాల్గొన్నానని.. దాన్నుంచి తొలగించారని సంగీత (Sangeetha) తెలిపారు. ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga)లో నాటి సంగతులను ఆమె గుర్తుచేసుకున్నారు. ఇటీవల, తాను కీలక పాత్ర పోషించిన ‘మసూద’ (Masooda) చిత్ర విశేషాలు పంచుకునేందుకు నాయకానాయికలు తిరువీర్‌, కావ్యలతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో హీరోయిన్‌ తల్లిగా నటించటం తన కెరీర్‌కు ప్లస్‌ అయిందని, మరోవైపు మైనస్‌ అయిందని సంగీత వివరించారు. ఆ చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడిని చూస్తే తిట్టుకుంటానే ఉంటానన్నారు. అనంతరం, తాను గతంలో అవకాశం కోల్పోయిన ఓ సినిమా గురించి వివరించారు.

‘‘బాల నటిగా 12 సినిమాల్లో నటించా. మసూద.. హీరోయిన్‌గా నేను నటించిన తొలి చిత్రం. మసూద అనేది ఉర్దూ పదం. ఇలాంటి హారర్‌ డ్రామా సినిమా మన తెలుగులో ఇటీవల రాలేదనుకుంటున్నా’’ అని కావ్య తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన పక్కన హీరోయిన్‌గా నటించాలని అల్లు అర్జున్‌ ఓ సందర్భంలో అడిగారని, అప్పటికి తాను చిన్న పిల్లకావడంతో ‘నేను హీరోయిన్‌ అయ్యే టైమ్‌కి మీరు ముసలివాళ్లు అయిపోతారు’ అని సమాధానమిచ్చానని కావ్య నవ్వుతూ తెలిపారు. ‘బాలు’, ‘గంగోత్రి’, ‘విజయేంద్ర వర్మ’, ‘అడవి రాముడు’ తదితర సినిమాల్లో బాల నటిగా మెప్పించింది కావ్య.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు