Published : 25 May 2022 01:54 IST

Tharun Bhascker: సల్మాన్‌ఖాన్‌ ఆఫర్‌ ఇస్తే ‘నో’ చెప్పా: తరుణ్‌ భాస్కర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ సినిమా ఆఫర్‌ ఇస్తే తాను నో చెప్పానని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తెలిపారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. కార్యక్రమ వ్యాఖ్యాత ఆలీ అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానమిచ్చారు. తాను మాంసాహారాన్నే ఎక్కువగా ఇష్టపడతానని, శాకాహారం తినాలంటే భయపడతానని చెప్పుకొచ్చారు. తన కుటుంబానికి సినీ నేపథ్యం లేదని, లఘు చిత్రాలు తీసిన అనుభవంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానన్నారు. ప్రస్తుతం తన కెరీర్‌ బాగుందని, ఒకవేళ వరుసగా మూడు ఫ్లాప్‌లొస్తే హీరో విజయ్‌ దేవరకొండతో మళ్లీ సినిమా చేసే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. విజయ్‌ వైల్డ్‌కార్డ్‌లాంటి వాడని పేర్కొన్నారు. తాను కట్టిన సప్లిమెంటరీ ఫీజుతో ఓ భవనం నిర్మించవచ్చంటూ కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. విజయ్‌ దేవరకొండ వాయిస్‌ను ఇమిటేట్‌ చేసి ఆకట్టుకున్నారు. ఈ సరదా ఎపిసోడ్‌ మే 30 రాత్రి 9: 30 గం.లకు ‘ఈటీవీ’లో ప్రసారంకానుంది.

విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో తరుణ్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు. తర్వాత, విశ్వక్‌సేన్ కథానాయకుడిగా ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘పిట్ట కథలు’ అనే వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మహానటి’, ‘ఫలక్‌నుమా దాస్‌’ తదితర చిత్రాల్లో నటించారు. రచయితగా, టీవీ హోస్ట్‌గానూ తన ప్రతిభను చాటారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని