Vinod Kumar: నేను అంబానీ కాదు.. డ్యాన్స్‌ చూసి నా భార్య వెళ్లిపోయింది: వినోద్‌ కుమార్‌

నటుడు వినోద్‌ కుమార్‌.. అలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు.

Published : 22 Feb 2022 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మౌనపోరాటం’, ‘కర్తవ్యం’, ‘మామగారు’, ‘సీతారత్నంగారి అబ్బాయి’ తదితర సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు వినోద్‌ కుమార్‌. అలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. సినిమా, వ్యక్తిగత విశేషాలు పంచుకున్నారు. ‘‘వినోద్‌ కుమార్‌కి చాలా ఆస్తులున్నాయి. జీవితంలో బాగా స్థిరపడ్డాడు. మినీ సైజు ముకేశ్‌ అంబానీ అని అంటుంటారు’’ అని అలీ వివరిస్తుండగా ‘‘మినీ సైజు కాదు కదా ముకేశ్‌ అంబానీకి ఉన్నదాంట్లో 0.1 శాతం నాకున్నా ఇక్కడెందుకు ఉంటా? లండన్‌లో ఉండేవాడిని’’ అంటూ వినోద్‌ నవ్వుతూ సమాధానమిచ్చారు.

వినోద్‌ కుమార్‌ ఆల్వా పేరును దివంగత అట్లూరి రామారావు (ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌) వినోద్‌ కుమార్‌గా మార్చారని తెలిపారు. ‘మౌనపోరాటం’ సినిమాలోని తన పాత్రకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని భయపడినట్టు చెప్పుకొచ్చారు. దర్శకుడు మోహన్‌గాంధీతో ఐదు సినిమాలకు పనిచేశానని, ఆయన చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండేవారన్నారు. కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావులాంటి దిగ్గజ దర్శకుల దర్శకత్వంలో నటించటం ఓ వరమని పేర్కొన్నారు. ఓ పాట షూటింగ్‌లో డ్యాన్స్‌ చేస్తుంటే.. దాన్ని చూసి తన భార్య అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆ నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. తనకు బాగా కావాల్సిన వ్యక్తిని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని