Ali Reza: ఆ షో విషయంలో తప్పు చేశా.. నటుడిగా బ్యాన్‌ చేస్తానన్నారు : అలీ రెజా

‘బిగ్‌బాస్‌’ కార్యక్రమ విషయంలో చిన్న తప్పు చేశానని, ఒకానొక సమయంలో ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌కు వెళ్లాల్సి వచ్చిందని నటుడు అలీ రెజా తెలిపారు. అమిత్‌ తివారితో కలిసి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ విషయంతోపాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు.

Published : 31 Mar 2022 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమ విషయంలో చిన్న తప్పు చేశానని, ఒకానొక సమయంలో ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌కు వెళ్లాల్సి వచ్చిందని నటుడు అలీ రెజా తెలిపారు. అమిత్‌ తివారితో కలిసి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ విషయంతోపాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. తాను పదో తరగతి వరకు చదువుకున్నానని, మారేడుపల్లి ప్రాంతంలోని అందరితోనూ పరిచయం ఉందన్నారు. ‘ఇగో’ వల్ల తన భార్యతో రెండు సార్లు బ్రేకప్‌ (సరదాగా) అయిందని చెప్పారు. ‘టీవీలో కనిపించడం లేదేంటి?’ అని ఆలీ ప్రశ్నించగా నటుడిగా తన బ్యాన్‌ గురించి స్పందించారు.

తన కుటుంబం గురించి, దర్శకుడు త్రివిక్రమ్‌తో చేసిన ప్రయాణం గురించి అమిత్‌ తెలిపారు. ‘పరువం వానగా’ (రోజా) అనే పాటను విజిల్‌ రూపంలో ఆలపించి, అలరించారు. సంబంధిత ప్రోమో నెట్టింట విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరి ముచ్చట్ల పూర్తి ఎపిసోడ్‌ ‘ఈటీవీ’లో ఏప్రిల్‌ 4న రాత్రి 9.30 గం.లకు ప్రసారంకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని