Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం

మెచ్యూరిటీ లేకపోవడం వల్ల దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాలో నటించలేదని అర్చన తెలిపారు. ఆ చిత్రం చేసుంటే బాగుండేదని ఫీలయ్యారు.

Published : 29 Jun 2022 02:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెచ్యూరిటీ లేకపోవడం వల్ల దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘మగధీర’ (Magadheera) సినిమాలో నటించలేదని అర్చన (Archana Shastry) తెలిపారు. ఆ చిత్రంలో చేసుంటే బావుండేదని ఫీలయ్యారు. తన భర్త జగదీష్‌తో కలిసి ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేసిన అర్చన ఈ విషయాలు పంచుకున్నారు. ఇదే వేదికపై.. తాను నటించిన ‘శ్రీరామదాసు’ సినిమా చిత్రీకరణను గుర్తుచేసుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావుతో మళ్లీ పనిచేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టారు. ‘పాండురంగడు’ సినిమాలోని బృందావనం నేపథ్య గీతానికి నందమూరి బాలకృష్ణకు డ్యాన్స్‌ నేర్పించానని, ఆయన మెచ్చుకున్నారని వివరించారు. తమ ప్రేమ, పెళ్లినాటి సంగతులు నెమరువేసుకున్నారు. అనంతరం, ‘‘పెద్ద సినిమాల్లో నటించే అవకాశం వచ్చి, చివరి నిమిషంలో రద్దు అయిన సందర్భాలున్నాయా?’’ అని కార్యక్రమ వ్యాఖ్యాత ఆలీ ప్రశ్నించగా అర్చన కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి ఎపిసోడ్‌ ‘ఈటీవీ’లో జులై 4 రాత్రి 9: 30 గం.లకు ప్రసారంకానుంది.

(‘పాండురంగడు’ చిత్రంలోని దృశ్యం)

అర్చన.. ‘తపన’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత, అల్లరి నరేశ్‌ హీరోగా వచ్చిన ‘నేను’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘శ్రీరామదాసు’, ‘పౌర్ణమి’, ‘యమదొంగ’, ‘పాండురంగడు’, ‘ఖలేజా’, ‘లయన్‌’, ‘వజ్ర కవచధర గోవింద’ తదితర చిత్రాలతో మెప్పించారు. ఈమె నటించిన తాజా చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ (10th Class Diaries) జులై 1న విడుదలకానుంది. వేదగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె తర్వాత అర్చనగా పేరు మార్చుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు