Colour Photo: ‘కలర్‌ ఫోటో’ సుహాస్‌లా ఫీలైతే హాలీవుడ్‌లో ఒక్కస్టార్‌ ఉండడు: ఆలీ

‘కలర్‌ ఫోటో’ సినిమా కోసం సుహాస్‌ ఫీలైనట్టు ఆంగ్ల నటులు ఫీలైతే హాలీవుడ్‌ ఖాళీ అవుతుందన్నారు ఆలీ . అక్కడి వారంతా నల్లగా ఉండటమే దానికి కారణమంటూ నవ్వులు పంచారు.

Published : 30 Jul 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కలర్‌ ఫోటో’ (Colour Photo) సినిమా కోసం సుహాస్‌ (Suhas) ఫీలైనట్టు ఆంగ్ల నటులు ఫీలైతే హాలీవుడ్‌ ఖాళీ అవుతుందన్నారు ఆలీ (Ali). అక్కడి వారంతా నల్లగా ఉండటమే దానికి కారణమంటూ నవ్వులు పంచారు. సుహాస్‌ హీరోగా దర్శకుడు సందీప్‌ రాజ్‌ (Sandeep Raj) తెరకెక్కించిన ‘కలర్‌ ఫోటో’ 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమానికి వారిని ఆలీ ఆహ్వానించి, శాలువాతో సత్కరించారు. సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. లఘు చిత్రాలు తీసే వారిపై చాలా మందికి చిన్న చూపు ఉంటుందని, దాన్ని ఈ సినిమా టీమ్ తిరగరాసిందని ఆలీ అన్నారు. సందీప్‌ రాజ్‌ పర్సనాలిటీ గురించి వివరించే క్రమంలో ఆలీ, సుహాస్‌ గిలిగింతలు పెట్టారు.

సుహాస్‌ తన పాత్ర గురించి వివరిస్తూ.. ‘‘ఎందుకు నా గురించి చెప్పడం.. కలర్‌ ఫోటో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అని, నేనూ వైవా హర్ష ఇతర పాత్రలు పోషిస్తున్నామని చెప్పండని టీమ్‌కి విజ్ఞప్తి చేశా’’ అని తెలిపారు. వెంటనే ఆలీ స్పందించి.. ‘‘నీలా ఫీలైతే హాలీవుడ్‌లో ఒక్క స్టార్‌ ఉండడు. ఇది (నలుపు) గ్యారెంటీ కలర్’’ అంటూ నవ్వులు కురిపించారు. అనంతరం, సందీప్‌ రాజ్‌ అతనికి రాత్రి 10:00 గం.లు ఎందుకు ప్రత్యేకమో చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కలర్‌ ఫోటో’లో హీరోయిన్‌గా చాందినీ చౌదరి, హీరోగా సుహాస్‌ని వద్దంటూ కొందరు సలహాలు ఇచ్చారన్నారు. సుహాస్‌.. ప్రేమికుల రోజున జరిగిన సరదా సంఘటనను పంచుకున్నారు. ఈ ‘కలర్‌’ ఫుల్ ఎపిసోడ్‌ ‘ఈటీవీ’లో (ETV) ఆగస్టు 1న రాత్రి 9:30 గం.లకు ప్రసారం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని