Niharika: చిరు, పవన్‌, నాగబాబుల్లో నిహారికకు ఎవరు ఇష్టమంటే?

చిన్నప్పుడు టీచర్‌, ఇంటర్మీడియట్‌ వచ్చాక డాక్టర్‌ అవుదామనుకున్నానని నటి, యాంకర్‌ నిహారిక చెప్పుకొచ్చింది.

Published : 16 Nov 2021 15:38 IST

హైదరాబాద్‌: చిన్నప్పుడు టీచర్‌, ఇంటర్మీడియట్‌ వచ్చాక డాక్టర్‌ అవుదామనుకున్నానని నటి, యాంకర్‌ నిహారిక చెప్పుకొచ్చింది. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి నిహారిక వచ్చి సందడి చేసింది. ఈ సందర్భంగా ఆలీ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.  తండ్రి నాగబాబు తనని ‘మమ్మీ’ అని పిలుస్తారని, అదే వరుణ్‌ పరిస్థితులను బట్టి నిహా, బాగా ముద్దొస్తే బంగారం, ఇంకా బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తారని నవ్వుతూ చెప్పింది. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, నాగబాబుల్లో ఎవరంటే ఇష్టం అని అడగ్గా, తన తండ్రి అంటే ఎనలేని ప్రేమ అని చెప్పుకొచ్చింది. ఇక చిన్నప్పుడు ఒకే ఒకసారి కొట్టారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. తనది పెద్దలు కుదిర్చిన వివాహమని, అంతకుముందెప్పుడూ చైతన్యను చూడలేదని నిహారిక తెలిపింది. సరదా సరదాగా సాగే ఈ షోలోకి యాంకర్‌ నిఖిల్‌ కూడా వచ్చి సందడి చేశాడు. పూర్తి ఎపిసోడ్‌ను చూడాలంటే నవంబరు 22వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటి వరకూ అలరించే ఈ ప్రోమో చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని