Chandoo Mondeti: నాగార్జునతో ‘విక్రమ్‌’ తరహాలో పోలీస్‌ కథ చేస్తా!

తనకు అగ్ర కథానాయకుడు నాగార్జున అంటే చాలా ఇష్టమని ఆయనతో ఓ పోలీస్‌ కథపై చర్చలు జరుపుతున్నానని

Published : 02 Aug 2022 12:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తనకు అగ్ర కథానాయకుడు నాగార్జున అంటే చాలా ఇష్టమని ఆయనతో ఓ పోలీస్‌ కథపై చర్చలు జరుపుతున్నానని దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) అన్నారు. నాగార్జునతో ‘విక్రమ్‌’లాంటి పవర్‌ఫుల్‌ స్టోరీతో సినిమా చేస్తానని చెప్పారు. చందూ దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా నటించిన చిత్రం ‘కార్తికేయ2’. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నిఖిల్‌తో కలిసి చందూ మొండేటి ఆలీ షోకు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన సరదా ప్రశ్నలకు అంతే ఫన్నీగా జవాబులు చెప్పారు. ‘నువ్వొక చిన్న సైజు విజయ్‌మాల్య అట కదా’ అని చందూను అడగ్గా, ‘స్కాములా.. దొంగతనం కూడా చేశామంటారు..’ అని నవ్వులు పూయించారు. ‘అదంతా ఒకప్పుడు’ అంటూ నిఖిల్‌ అన్నారు. ‘కార్తికేయ2’లో చాలా పాములు ఉంటాయని చెప్పారు. ‘భార్యలకు అబద్ధాలు చెప్పకపోతే, ఇన్ని కాపురాలు ఉంటాయా’ అంటూ చందూ చెప్పగా, ‘చిరాగ్గా ఉన్న సమయంలో ఫోన్‌ చేసి.. డు యు లవ్‌ మీ’ అని అడుగుతారని నిఖిల్‌ చెప్పడంతో నవ్వుల పువ్వులు విరిశాయి. ఆగస్టు 8న ఈ షో టెలికాస్ట్‌ కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని