Raadhika: అందుకు చిరంజీవిని 23 సార్లు కొట్టా..: రాధిక

ఓ సినిమాలో హీరో చిరంజీవిని కొట్టే సన్నివేశం బాగా పండేందుకు 23 టేకులు తీసుకున్నానని, అలా 23 సార్లు కొట్టడంతో ఆయన ముఖం ఎరుపెక్కిందని రాధికా శరత్‌కుమార్‌ అన్నారు.

Published : 13 Apr 2022 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ సినిమాలో హీరో చిరంజీవిని కొట్టే సన్నివేశం బాగా పండేందుకు 23 టేకులు తీసుకున్నానని, అలా 23 సార్లు కొట్టడంతో ఆయన ముఖం ఎరుపెక్కిందని రాధిక అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈమె నాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఆలీతో కలిసి సూపర్‌హిట్‌ గీతం ‘సందె పొద్దులకాడ’ పాటకు డ్యాన్‌ చేసి అలరించారు. చంద్రమోహన్‌తో కలిసి నటించిన ‘మూడు ముళ్లు’ షూటింగ్‌, దర్శకుడు కోదండ రామిరెడ్డి, తన హెయిర్‌ డ్రెస్సర్‌ రీటా సంగతులు పంచుకున్నారు. దర్శకుడు భారతీరాజాతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తనకెలాంటి బేధభావం లేదని, అన్ని మతాల పండగలను జరుపుకొంటానని తెలిపారు. బుల్లితెరపైకి వచ్చేందుకు కారణమేంటో వివరించారు. శరత్‌కుమార్‌తో పరిచయం, పెళ్లి ఎలా జరిగిందో చెప్పారు. మరి చిరంజీవిని కొట్టిన ఆ సీన్‌ ఏ సినిమాలోది?అనే ప్రశ్నకు సమాధానంతోపాటు మరిన్ని ముచ్చట్లతో కూడిన పూర్తి ఎపిసోడ్‌ ‘ఈటీవీ’లో ఏప్రిల్‌ 18న రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది. ప్రస్తుతం ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని