Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా

ప్రముఖ నటుడు చిరంజీవి ఏ విషయాన్నైనా ఇట్టే నేర్చుకుంటారని, ఆ విషయంలో ఆయన్ను మెచ్చుకోవాల్సిందేనని రెజీనా అన్నారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

Published : 06 Jul 2022 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటారని, ఆ విషయంలో ఆయన్ను మెచ్చుకోవాల్సిందేనని రెజీనా (Regina Cassandra) అన్నారు. ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేయడం ఎలా అనిపించింది?’ అని వ్యాఖ్యాత ఆలీ అడగ్గా రెజీనా స్పందించారు. చిరంజీవి, రెజీనా కలిసి ‘ఆచార్య’ (Acharya) సినిమాలోని ‘సానా కష్టం’ పాటకు నర్తించిన సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సంగతితోపాటు రెజీనా మరిన్ని విశేషాలను ఈ షోలో పంచుకున్నారు. తాను పాఠశాల రోజుల్లో స్కూల్‌ పీపుల్‌ లీడర్‌గా ఉన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. హారర్‌ సినిమాలంటే ఇష్టమని తెలిపారు. గతంలో తాను నటించిన ‘అ!’ సినిమా గురించి చెబుతూ.. పాత్ర నచ్చితే దానికి తగ్గట్టు రూపురేఖలు మార్చుకుంటానని వివరించారు. ఈ ఎపిసోడ్‌ ‘ఈటీవీ’లో జులై 11 రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది.

‘కంద నాల్‌ ముదల్’ అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసిన రెజీనా ‘శివ మనసులో శ్రుతి’ (SMS)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడంతో వరుస అవకాశాలు అందుకున్నారు. ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ’, ‘కొత్త జంట’, ‘పిల్లా.. నువ్వులేని జీవితం’, ‘రా రా.. కృష్ణయ్య’, ‘పవర్‌’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ తదితర సినిమాల్లోని విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘నేనే నా’, ‘శాకినీ ఢాకినీ’ తదితర సినిమాలతోపాటు కొన్ని వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. రెజీనా నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ (Anya's Tutorial) ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని