Satya Prakash: 600 సినిమాల్లో నటించానని చెప్పుకొంటా: సత్యప్రకాశ్‌

‘నో పెయిన్‌.. నో గెయిన్‌.. అది మారిస్తే నో గెయిన్‌ విత్‌ అవుట్‌ పెయిన్‌’ అంటున్నారు నటుడు సత్య ప్రకాశ్‌.

Published : 09 Mar 2022 01:17 IST

హైదరాబాద్: ‘నో పెయిన్‌.. నో గెయిన్‌.. అది మారిస్తే నో గెయిన్‌ విత్‌ అవుట్‌ పెయిన్‌’ అంటున్నారు నటుడు సత్య ప్రకాశ్‌. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతినాయకుడిగా ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. వేదికపై ఆలీతో కలిసి ఆయన చేసిన సందడి నవ్వులు పూయించింది. తాను పుట్టింది విజయనగరంలో అని, పెరిగిందంతా ఒడిశాలో అని సత్యప్రకాశ్‌ చెప్పుకొచ్చారు. కొన్ని రోజులు బ్యాంకులో కూడా ఉద్యోగం చేసినట్లు తెలిపారు. తానేదో పిచ్చి పనులు చేస్తుంటే ఎవరో డైరెక్టర్‌ పిలిచి వేషం ఇచ్చారని, ఆ తర్వాత తనకు అవకాశం ఇచ్చినందుకు ఆ దర్శకుడు ఇప్పటికీ బాధపడుతున్నారని నవ్వుతూ చెప్పారు. ఒక సినిమా షూటింగ్‌ సందర్భంగా కో-డైరెక్టర్‌ అనరాని మాటలు అన్నారని వాపోయారు. ఇంకా ఆయన పంచుకున్న విశేషాలు తెలియాలంటే వచ్చే సోమవారం వరకూ వేచి చూడాల్సిందే! అప్పటివరకూ ఈ సరదా ప్రోమో చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని