Jonnavithula: ‘32 మంది హీరోయిన్ల పేర్లతో పాటరాశా’: జొన్నవిత్తుల

టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించి ప్రముఖ గీత రచయితగా పేరు పొందారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు...

Updated : 24 Jul 2022 11:09 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించి ప్రముఖ గీత రచయితగా పేరు పొందారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavithula Ramalingeswara Rao). ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ చిట్‌చాట్‌ షో ‘ఆలీతో సరదాగా’లో (Alitho Saradaga) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తన కెరీర్‌పై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1984 నుంచి తనకి చిన్న జీయర్‌ స్వామితో పరిచయాలున్నాయని.. ఓ సమయంలో తాను మద్రాస్‌ వెళ్దామని నిర్ణయించుకున్నప్పుడు ఆ స్వామిని కలిశానని తెలిపారు. ‘‘సినిమా పాటలు రాయడానికి వెళ్తున్నావా? తెలివితేటల్ని మంచిగా ఉపయోగించండి’’ అంటూ చిన్న జీయర్‌ స్వామి ఆల్‌బుకరా పండు తన చేతిలో పెట్టారని జొన్నవిత్తుల ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకొని నవ్వులు పూయించారు.

వేటూరి, సిరివెన్నెల.. గేయ రచయితలుగా ఫామ్‌లో ఉన్న సమయంలో రాఘవేంద్రరావు తనకు మహోపకారం చేశారని, ఓ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం తనకు కల్పించారని తెలిపారు. అనంతరం ఆలీ... ‘‘మీకు ఇప్పటి వరకూ ఎన్ని అవార్డులు వచ్చాయి?’’ అని ప్రశ్నించగా.. ‘‘నాకు ఇప్పటి వరకూ ఎలాంటి అవార్డులు రాలేదు. పండుగ పర్వదినాల్లో ప్రతి ఛానెల్‌లో ఎక్కువగా వినబడే ‘అందరి బంధువయా’, ‘మహా కనకదుర్గా... విజయ కనకదుర్గా’, ‘జగదానంద కారకా’, ‘జయ జయ శుభకర వినాయక’, ‘అయ్యప్ప దేవాయ నమః’ ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు రాసి అందర్నీ అలరిస్తున్నా. ఇంతకుమించిన అవార్డులేం కావాలి’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘విక్రమార్కుడు’లోని ‘జింతాత చితా చితా’, ‘పెళ్లిసందడి’ చిత్రంలో 32 మంది అందగత్తెల పేర్లను ఉపయోగించి ‘రమ్యకృష్ణలాగ ఉంటదా?’ అని పాట రాసినట్లు వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని