చెప్పుల దండేస్తామని బెదిరించారు: నిరుపమ్‌

సీరియళ్లను సీరియల్‌లాగే చూస్తే ఏ సమస్య ఉండదని అంటున్నారు బుల్లితెర నటుడు నిరుపమ్‌. డాక్టర్‌బాబుగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్న ఆయనకు సీరియల్‌లో నటిస్తున్నాడన్న కారణంతో సినిమా అవకాశం పోయిందట. ఆలీ వ్యాఖ్యగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో నిరుపమ్‌ తన భార్య మంజులతో కలిసి పాల్గొని సందడి చేశారు.

Updated : 12 May 2021 09:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డాక్టర్‌బాబుగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారు బుల్లితెర నటుడు నిరుపమ్‌. ఎంతోపేరు తీసుకొచ్చిన ఆ సీరియళ్ల వల్లే తనకు సినిమా అవకాశం చేజారిపోయిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎందుకలా జరిగిందో ఆలీ వ్యాఖ్యతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పంచుకున్నారు. తన భార్య మంజులతో కలిసి తాజాగా సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధాలు ఇచ్చారు. సీరియల్‌ను సీరియల్‌లా కాకుండా వ్యక్తిగతంగా తీసుకుంటేనే సమస్యలు వస్తాయని, అలాంటి కొందరు తనకు ఫోన్‌ చేసి చెప్పుల దండ వేసి సన్మానిస్తామని బెదిరించారని ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలియాలంటే.. మే 17 ‘ఈటీవీ’లో ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమోను చూసి ఆనందించండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని