Ram Gopal Varma: అలా అనుకుంటే అందరూ నోరుమూసుకోవాల్సిందే: ఆర్జీవీ

ఏదైనా మాట్లాడితే ఎదుటివారు ఫీల్‌ అవుతారనుకుంటే అందరూ నోరుమూసుకొని, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందన్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. తానెప్పుడూ తనకిష్టమొచ్చినట్టే ఉంటున్నానని తెలిపారు.

Published : 05 May 2022 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా మాట్లాడితే ఎదుటివారు ఫీల్‌ అవుతారనుకుంటే అందరూ నోరుమూసుకొని, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందన్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. తానెప్పుడూ తనకిష్టమొచ్చినట్టే ఉంటానని తెలిపారు. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘మా ఇష్టం’ సినిమా కథానాయికలు నైనా గంగూలీ, అప్సరా రాణితో కలిసి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సందడి చేశారు. తనలా బతకాలనుకుంటే దైవం, సమాజం, కుటుంబాన్ని వదిలేయాలని చెప్పుకొచ్చారు.

తనకు నచ్చిన కథలను సినిమాలుగా తీస్తుంటానని, వాటిని థియేటర్‌లకు వెళ్లి చూడాలా, వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టమని పేర్కొన్నారు. తాను తెరకెక్కించిన సినిమా విజయం అందుకున్నా, పరాజయం పొందినా పట్టించుకోనన్నారు. ఒక చిత్రం పూర్తవగానే దాని గురించి ఏం ఆలోచించకుండా తదుపరి సినిమాపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వివరించారు. పుట్టినరోజు వేడుకంటే తనకు నచ్చదని, కానీ ఇప్పుడు కొందరు అమ్మాయిలు తనకు బర్త్‌డే పార్టీలు ఇస్తుంటే కాదనలేకపోతున్నానని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి అయితే డబ్బంతా తీసుకుని విదేశాలకు వెళ్లిపోతానని నవ్వులు పంచారు. తాను గతంలో దర్శకత్వం వహించిన ‘వంగవీటి’ సినిమా ఆడియో వేడుకలో చోటుచేసుకున్న ఓ సంఘటన గురించి వివరించారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఎపిసోడ్‌ మే 9న రాత్రి 9.30 గం.లకు ‘ఈటీవీ’లో ప్రసారంకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని