Anil raavipudi: బాలకృష్ణతో సినిమా తీయాలని అప్పుడే అనుకున్నా: అనిల్ రావిపూడి
ఒకరు ఫ్యామిలీ ప్యాక్‌తో నవ్వించే కమెడియన్ మాత్రమే కాదు, సిక్స్ ప్యాక్‌తో అలరించే హీరో కూడా. ఇక మరొకరు డైలాగ్స్‌తో విజిల్స్ కొట్టించే రైటర్ మాత్రమే కాదు, ఫన్నీ ఎంటర్టైనర్తో బిందాస్ ఎంటర్టైనింగ్ ఇస్తున్న డైరెక్టర్ కూడా.
ఒకరు ఫ్యామిలీ ప్యాక్‌తో నవ్వించే కమెడియన్ మాత్రమే కాదు.. సిక్స్ ప్యాక్‌తో అలరించే హీరో కూడా. ఇక మరొకరు డైలాగ్స్‌తో విజిల్స్ కొట్టించే రైటర్ మాత్రమే కాదు.. ఫన్నీ ఎంటర్టైనర్తో బిందాస్ ఎంటర్టైనింగ్ ఇస్తున్న డైరెక్టర్ కూడా. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌తో వచ్చిన క్రేజీ స్టార్స్ సునీల్, అనిల్ రావిపూడి ఇద్దరు ఆలీతో చెప్పిన ముచ్చట్లేంటో చూద్దాం.
అనిల్‌తో మొదటిసారి పనిచేసినట్లు ఉన్నారు. ఎలా అనిపించింది?
సునీల్: అనిల్ దర్శకత్వంలో నటించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు ‘గౌతమ్ ఎస్ఎస్సీ’, ‘బాస్’ సినిమాల షూటింగ్లో కలిశానంతే. అనిల్ దర్శకత్వంలో నటించడం అద్భుతమైన అనుభూతి. చాలా సులువుగా ఉంటుంది. శ్రమంతా ఆయనే పడతారు. మనకు కష్టం లేకుండా చేస్తారు. మళ్లీ ఎప్పుడెప్పుడు అనిల్‌తో పని చేస్తానా? అని ఉంది.
‘ఎఫ్3’ షూటింగ్లో 40రోజులు పాల్గొన్నారా?
సునీల్: దాదాపు 70 రోజులు పాల్గొన్నా. షూటింగ్ జరుగుతున్న సమయంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్, రాజేంద్రప్రసాద్, మీరు(ఆలీ), వెన్నెల కిశోర్, పృథ్వీ, రఘుబాబు ఇలా చాలా మంది ఆర్టిస్టులతో కలిసి ఉండటం చాలా సంతోషానిచ్చింది. నేను ఇంత మందితో కలిసి నటించడం ఇదే మొదటిసారి.
ఒంగోలులో డాడీ కాకుండా, హైదరాబాద్‌లో డాడీ ఎలా ఉన్నారు?
అనిల్ రావిపూడి: హైదరాబాద్‌లో డాడీ బ్రహ్మాండంగా ఉన్నాడు(నవ్వుతూ). నేను రాజేంద్రప్రసాద్‌ని ‘డాడీ’ అని పిలుస్తాను. నేను తీసిన ప్రతి సినిమాలో ఆయన ఉంటారు. ‘ఎఫ్3’లో కూడా నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇక ఒంగోలులో ఉంటున్న మా నాన్న కూడా బాగున్నారు.
‘ఎఫ్4’ తీస్తారా?భవిష్యత్తులో కామెడీ సినిమాలే తీస్తారా. యాక్షన్వి కూడా తీస్తారా?
అనిల్: ‘ఎఫ్3’ని ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ‘ఎఫ్4’ తీస్తాను. నేను చేసిన సినిమాల్లో యాక్షన్వి చాలానే ఉన్నాయి. ‘పటాస్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాల్లో ఎంటర్టైనింగ్ ఎంత ఉంటుందో అంతకు డబుల్ యాక్షన్ ఉంటుంది.
అనిల్‌లో మీకు నచ్చిన మూడు గుణాలు చెప్పండి?
సునీల్: ఎప్పుడూ హుషారుగా, నవ్వుతూ ఉంటారు. మరొకటి తను కష్టపడే విధానం. అన్నింటికంటే ముఖ్యమైంది తనకు అసలు కోపం రాదు. ఎవ్వరికీ ఏ విషయంలో నో చెప్పడు.
ఎవరికైనా స్నేహితులు మన వయసుకు దగ్గరగా ఉండే వాళ్లు ఉంటారు. మీకు ముసలివాళ్లు ఎక్కువ మంది ఉన్నారుట నిజమేనా?
సునీల్: నిజమే. నాకు 6 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఇక ఇంట్లో మగవాళ్లెవ్వరూ లేరు. నేను ఒక్కడి. దీంతో అన్ని చూసుకునేవాడిని. నా కంటే పెద్దవాళ్లు మాట్లాడేటప్పుడు నాకు చాలా ఆసక్తి ఉండేది. అందుకే నా స్నేహితుల్లో నా కంటే పెద్దవాళ్లుంటారు.
భీమవరం నుంచి హైదరాబాద్ ఇష్టంతో వచ్చావా?
సునీల్: ఆర్థికంగా మా పరిస్థితి బాగానే ఉండేది. హైదరాబాద్ రావడం, సినిమాల్లో నటించడం నా కల. ఇంట్లో వాళ్లు చదువుకోమన్నారు. పీజీ ఒక సంవత్సరం చదివా. నాకున్న బైక్ అమ్మేసి ఆ డబ్బుతో హైదరాబాద్ వచ్చేశా.
మొదట హీరో అవ్వాలనుకుని మళ్లీ విలన్ అవ్వాలని అనుకున్నావు ఎందుకు?
సునీల్: మొదట హీరో అవ్వాలని అనుకున్నా. ఇంటర్లో ఉన్నప్పుడు హీరోగా నెగ్గలేమేమో అనిపించింది. ఆ సమయంలో మోహన్‌బాబు విలన్‌గా చేసిన ‘దేవత’ లాంటి సినిమాలు చూసి ఆయన లాగా అవుదామనుకున్నా.
‘ఎఫ్3’ సినిమా షూటింగ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అన్ని రోజులు ఎందుకుచేశారు?
అనిల్: ఫలక్‌నుమా ప్యాలెస్ చాలా ఖరీదైంది. కరోనా కారణంగా చాలా రోజులు షూటింగ్ వాయిదా పడింది. అందుకే ఎక్కువ రోజులు చేయాల్సి వచ్చింది. ‘ఎఫ్3’ షూటింగ్ అంతా ఇండియాలోనే చేశా.
మీ సినిమాల గురించి ఇంట్లో చర్చ జరుగుతుందా?
అనిల్: అంతగా ఉండదు. నా భార్యది చాలా జాలి హృదయం. అందుకే ఏ సినిమాని తక్కువగా చూడదు. వాళ్ల కష్టాన్ని గుర్తిస్తుంది.
‘ఎఫ్4’ కూడా వెంకటేశ్, వరుణ్తేజ్లతోనే తీస్తారా?
అనిల్: ప్రస్తుతానికి ఆలోచనంతా ‘ఎఫ్3’పైనే ఉంది. ‘ఎఫ్4’ కచ్చితంగా తీస్తాము. దానికి సంబంధించిన కథ ఇంకా సిద్ధం చేసుకోలేదు. కథ రెడీ అయ్యాక ఎవరు అయితే బాగుంటుంది అని చెప్పవచ్చు.
‘ఎఫ్3’ ఎలా ఉంటుంది? ఈ సినిమాలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్పారు?
అనిల్: ఎవరి ఆరాటమైనా, పోరాటమైనా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆ డబ్బు చుట్టూ జరిగే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషనే ‘ఎఫ్3’. అన్ని పాత్రలు తొందరగా డబ్బును సంపాదించి అందరి కంటే ధనవంతులు అవ్వాలని డ్రీమ్స్‌లో ఉంటాయి. ఒకరిని ఒకరు ముంచేసి అయినా సరే పైకి ఎదగాలి అనుకుంటుంటారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు వందశాతం నటించారు. ఇది టీమ్ వర్క్. అందుకే అందరికీ వంద మార్కులు వేస్తాను.
దిల్‌రాజు బడ్జెట్ విషయంలో వ్యయం ఎక్కువవుతుందని ఎప్పుడైనా చెప్పారా?
అనిల్: నేను దిల్‌రాజు బ్యానర్లో చేస్తున్న ఐదో సినిమా ఇది. ఆయనకు నా గురించి తెలుసు. నేను ఏదీ వృథా చేయనని తెలుసు. సినిమాకు ఏమి కావాలో అదే చేస్తాను.
యాక్టర్ అవ్వాలనే కోరిక ఉందా? భవిష్యత్తులో హీరోగా చేయాల్సి వస్తే చేస్తారా?
అనిల్: హీరోగా చేయాలని లేదు. అది చాలా పెద్ద బాధ్యత. నేను అలాంటివి తీసుకోను. ఒకవేళ అవకాశం వస్తే ఆర్టిస్టుగా చేస్తా.
నీ స్నేహితుడికి టార్చ్‌లైట్ ఇచ్చి ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండమని స్టేజీ ఎక్కావట దాని కథ ఏంటి?
సునీల్: ఐదో తరగతిలో జంగారెడ్డి గూడెం దగ్గర ఒక ఊరులో చదివాను. అప్పుడు చిరంజీవి ‘మహానగరంలో మాయగాడు’ సినిమాలోని పాటకు డాన్స్ చేశాను. ఒరిజినల్ పాటలో ఫ్లాష్ లైట్ ఉంది. నేను టార్చ్‌లైట్‌ని వాడుకున్నాను.
‘పుష్ప’ తర్వాత విలన్‌గా ఇతర భాషల నుంచి ఏమైనా అవకాశాలు వస్తున్నాయా?
సునీల్: తమిళం, హిందీ నుంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో రెండు ప్రాజెక్టులు ఓకే చేశాను. రెండూ విలన్ తరహా పాత్రలే. హిందీలోనూ రెండు సినిమాలు ఒప్పుకున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు చెబుతాను.
మీ తర్వాత సినిమాలో బాలయ్యని ఎలా చూపించబోతున్నారు?
అనిల్: స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నేను చాలా ఆతృతగా ఉన్నాను. బాలకృష్ణ గత సినిమాల్లో కంటే విభిన్నంగా చూపించాలని ప్రయత్నిస్తున్నా. ఆయన ఎనర్జీ ఆయన మార్కు కనిపిస్తూనే ఉంటుంది. ‘లయన్’ సినిమా అప్పుడు బాలకృష్ణతో సినిమా తీయాలని అనుకున్నాను. అది ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో కామెడీ టచ్ ఉంటుంది. కానీ ప్రేక్షకులు యాక్షన్‌లో ఓ కొత్త యాంగిల్ చూస్తారు.
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్‌ని కష్టపెట్టారని విన్నాం నిజమేనా?
అనిల్: అసలు లేదు. 5 నెలలు షూటింగ్ చేశాం. ఆయన షూటింగ్ జరుగుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. స్పాట్‌కు వస్తే ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు.
విజయశాంతికి అభిమానా మీరు? ఆవిడని సినిమాల కోసం ఎలా ఒప్పించారు?
అనిల్: ఆవిడని ఇష్టపడని వాళ్లుండరు. ‘రాజా ది గ్రేట్’ సినిమాలోనే తీసుకువద్దామని ప్రయత్నించాం. కానీ కుదరలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కథ విన్నాక ఓకే చేశారు. కానీ ఆవిడకి ఫైట్స్ చేయలేకపోయానని వెలితి ఉంది. భవిష్యత్తులో ఏదైనా మంచి కథ ఉంటే తప్పకుండా మీతో ఫైట్స్ చేయిస్తాను అని చెప్పా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు. -
Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట..’లో ‘రంగస్థలం’ ఛాయలు: నిర్మాత ధీరజ్ సమాధానమేంటంటే?
ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఒకటి. టీమ్ ప్రెస్మీట్లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలియజేసింది. -
lavanya tripathi: పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదు!
సినిమాల ఎంపికలో నేనెప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తూనే వచ్చా. ఎక్కువ చిత్రాలు చేసేయాలని ఎప్పుడూ ఆరాటపడలేదు. చేసేవి కొన్ని చిత్రాలైనా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించా. నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నాకలాంటి గుర్తింపునే తీసుకొచ్చాయి’ -
mrunal thakur: నాకొచ్చే పాత్రలు నాకొస్తాయి
నటించిన ప్రతి భాషలోనూ అందం.. ఆకట్టుకునే అభినయంతో తనదైన ముద్ర వేస్తోంది మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’లో సీతగా.. ‘హాయ్ నాన్న’లో యష్నగా తెలుగువాళ్లకి దగ్గరైన ఆమె, ‘పూజా మేరీ జాన్’ హిందీ చిత్ర ప్రచారంలో ఉంది. అందులో భాగంగా తను పంచుకున్న కొన్ని కబుర్లు ఇవి.
తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు