Vadde Naveen: యూట్యూబ్ కామెంట్లకు చెక్.. ఆలీతో సరదాగాలో వడ్డే నవీన్ ఎపిసోడ్ ఎప్పుడంటే?
వడ్డే నవీన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కథానాయకుడిగా 90వ దశకం చివరి నుంచి 2010 వరకూ దాదాపు పది, పన్నెండేళ్ల పాటు
హైదరాబాద్: వడ్డే నవీన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కథానాయకుడిగా 90వ దశకం చివరి నుంచి 2010 వరకూ దాదాపు పది, పన్నెండేళ్ల పాటు వరుస సినిమాలతో అలరించారు. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల్లో తనదైన నటన కనబరిచారు. ఇక ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘ఆలీతో సరదాగా’. నేటి తరం నటులతో పాటు, అలనాటి నటులు, దర్శకులతో ఆలీ సాగించే సంభాషణ చాలా సరదాగా ఉంటుంది. ప్రతి వారం కొత్త ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో, పూర్తి ఎపిసోడ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ కాగానే, వేల సంఖ్యలో కామెంట్లు వస్తాయి. అలాంటి వాటిలో ఎక్కువ కనిపించేది ‘వడ్డే నవీన్‌ను ఇంటర్వ్యూకు పిలవండి’. దీనిపై ‘ఆలీతో సరదాగా’ నిర్మాణ సంస్థ జ్ఞాపిక ప్రొడక్షన్స్ స్పందించింది. వడ్డే నవీన్ ప్రస్తుతం ఏ షోలకూ రావడం లేదని, తమని, అనిల్‌ని తిట్టవద్దని జ్ఞాపిక ప్రొడక్షన్స్ నిర్మాత ప్రవీణ అన్నారు.
ఇదే విషయమై ఆలీ మాట్లాడుతూ.. ‘‘వడ్డే నవీన్‌ను చాలా సార్లు పిలిచాం. దానికి ఆయన స్పందిస్తూ, ‘‘తప్పకుండా మీ షోకు వస్తాను. కానీ, ఏదైనా అద్భుతం చేసి వస్తా’ అని చెబుతారు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య స్నేహం దాదాపు 30ఏళ్లుగా కొనసాగుతోంది. మేమంతా చెన్నైలోని ఒకే వీధిలో ఉండేవాళ్లం. ఒక నిర్మాత కుమారుడన్న గర్వం ఎప్పుడూ ఆయనకు లేదు. స్నేహానికి మంచి విలువ ఇచ్చేవారు’’అని ఆలీ చెప్పుకొచ్చారు. మరి వడ్డే నవీన్ అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్