Alitho Saradaga: పాత్ర నచ్చితే మళ్లీ విలన్‌గా చేస్తా: గోపీచంద్
నాలో అప్పటి నటుడిని మళ్లీ చూస్తారు..!
హీరో మెటీరియల్‌కి సరితూగే కొలతలున్న నటుడు గోపీచంద్ (Gopichand). మాస్, యాక్షన్, కామెడీ.. ఇలా ఒక్కటేమిటి అన్ని అంశాల్లోనూ హీరోగా తనదైన ముద్ర వేశారు. అందుకే అభిమానులు ఆయన్ని ‘మాచో స్టార్’ అని పిలుచుకుంటున్నారు. ఆయన హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) జులై1న విడుదల కానున్న సందర్భంగా ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆయనతో పాటు దర్శకుడు మారుతి (Maruthi) కూడా ఇందులో పాల్గొని ‘పక్కా కమర్షియల్’ చిత్ర విశేషాలు తెలియజేశారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..
మీరు రష్యాలో చదివారట? ఎన్ని సంవత్సరాలు ఉన్నారక్కడ?
గోపీచంద్: అప్పుడు మనకు తెలిసిన వాళ్లంతా అక్కడే చదువుతున్నారు. అందుకే నేనూ రష్యా వెళ్లాను. అయిదు సంవత్సరాలు ఉన్నాను. ఇంజినీరింగ్ అక్కడే పూర్తి చేశాను.
మీ కోసమే మీ నాన్నగారు(టి. కృష్ణ) ఒక స్కూల్ కట్టించారట?దాని కథేంటి?
గోపీచంద్: అవును.. మాది ఒంగోలు పక్కనున్న చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు అన్నయ్యని, నన్ను స్కూల్‌లో జాయిన్ చేయడానికి దగ్గర్లో పాఠశాలలు లేక ఆయనే మంచి స్కూల్ పెడదామనే ఉద్దేశంతో ప్రారంభించారు. అక్కడ నేను మూడో తరగతి వరకు చదివాను. ఆ తరువాత మా ఫ్యామిలీ చెన్నైకి మారింది. ‘టి.కృష్ణ మెమోరియల్ స్కూల్’ పేరుతో ఇప్పటికీ ఆ స్కూల్ రన్ అవుతోంది. ప్రతీ సంవత్సరం ఆ స్కూల్‌ని సందర్శిస్తుంటాం.
అసలు మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
గోపీచంద్: నిర్మాత నాగేశ్వరరావు గారే కారణం. ‘నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నాను’ అన్నప్పుడు బాబాయి పోకూరి బాబూరావు(ఈతరం ఫిలింస్) ‘ఎందుకురా! ఇండస్ట్రీకి’ అన్నారు. దర్శకులుగా ఉన్నప్పుడే నాన్నగారు, అన్నయ్య చనిపోవటంతో ఒక విధమైన విముఖత. కానీ ‘నేను సినిమాల్లో చేస్తాను’ అనడంతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య నా ఆసక్తి గమనించి ‘తొలివలపు’ (Tholivalapu) తీశారు. అదే నా మొదటి సినిమా. దానికి నాగేశ్వరరావు గారే నిర్మాత.
‘నాన్నగారు నా సక్సెస్ చూసుంటే బాగుండేద’ని మీకనిపిస్తుందా?
గోపీచంద్: అనిపిస్తుంది.. హీరోగా నా సక్సెస్‌ని చూసుంటే నాన్నగారు, అన్నయ్య చాలా ఆనందపడేవారు. దురదృష్టవశాత్తు వారిద్దరూ లేరు.
ఆరడుగుల కటౌట్ మీది.. ప్రేమ సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్‌లో?
గోపీచంద్: ఇండస్ట్రీలో అటువంటివేం లేవు(నవ్వుతూ). వచ్చామా.. మన పని మనం చేశామా.. అంతే. కానీ, కాలేజ్ డేస్‌లో చిన్న లవ్ స్టోరీ ఉంది. అందంగా ఉందని రష్యన్ అమ్మాయికి ప్రపోజ్ చేశా. ఆ అమ్మాయి మనిద్దరి దేశాలు వేరని రిజెక్ట్ చేసింది. ఓకే అని లైట్ తీసుకున్నా(నవ్వుతూ)
‘రణం, యజ్ఞం, లక్ష్యం, లౌక్యం, సౌఖ్యం’ ఈ టైటిళ్ల వెనక సీక్రెట్ ఏంటి?
గోపీచంద్: సీక్రెట్ ఏం లేదు. అలా కుదిరిందంతే. నాకు ఎటువంటి సెంటిమెంట్లు లేవు. కానీ, ‘సౌఖ్యం’ (Soukhyam) సినిమాకి మాత్రం సరదాగా ఓ చర్చ నడిచింది. నేనొద్దన్నా, ఆ టైటిల్ కావాలనే వాటికి కలిసేలా పెట్టారు.
హీరోగా ప్రారంభించి, విలన్‌గా సక్సెస్ అయ్యి మళ్లీ హీరోగా నిలిచారు... ఈ ప్రయాణం ఎలా?
గోపీచంద్: ‘తొలివలపు’ (Tholivalapu) సినిమా ఫెయిలయ్యాక, అవకాశాలు ఏం లేక ఆరునెలలు ఖాళీగా ఉన్నాను. ఆలోచనలో పడ్డా. ఈ రూటు మనకు కరెక్టేనా అని. నేనంతకు ముందే కలిసిన దర్శకుడు తేజ ఒక రోజు సాయంత్రం ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మని పిలిచారు. ‘జయం’(Jayam) స్టోరీలోని చిన్న సీన్ చెప్పారు. వెంటనే చేస్తానని చెప్పా. తరువాతి రోజు నుంచే షూటింగ్ ప్రారంభించారు. ‘జయం’ సక్సెస్ తరువాత వరుసగా విలన్ రోల్స్ చేశాను. అవి నన్ను మాస్ ఆడియన్స్‌కి బాగా దగ్గర చేశాయి. ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాను.
ఇప్పుడు హీరోగా మంచి స్థాయిలో ఉన్నారు. మళ్లీ విలన్‌గా ఏమైనా చేస్తారా?
గోపీచంద్: చేస్తాను. కథ, రోల్ నాకు నచ్చాలి. నేను విలన్‌గా చేసిన పాత్రలన్నీ హీరోలకి దీటుగా ఉండేవే. ఆ వైవిధ్యం ఉంటేనే చేస్తాను.
మొదటి సక్సెస్ ‘యజ్ఞం’ ఎలా వచ్చింది?
గోపీచంద్: ఆ స్టోరీకి నన్ను ఎంపిక చేయడం ఆశ్చర్యంగానే జరిగింది. మొదట ‘యజ్ఞం’(yagnam) ప్రభాస్ దగ్గరికి వెళ్లింది. కొత్త డైరెక్టర్ అని రిజెక్ట్ చేశారు. తరువాత కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లింది. అక్కడా అదే జవాబు. ఆ తరువాత బాబాయి పోకూరి బాబూరావు నన్ను పిలిచి నువ్వు చేస్తావా అని అడిగారు. ఒప్పుకున్నాను. అప్పటికి ‘వర్షం’, ‘నిజం’ షూటింగ్స్ జరుగుతున్నాయి.
‘ఒక్కడు’లో విలన్ పాత్ర మీ దగ్గరికి వచ్చిందట?
గోపీచంద్: అవును. అప్పటికే ఆ పాత్రకు ప్రకాశ్‌రాజ్‌ని సంప్రదించారు. ఆయనకు డేట్స్ కుదరకపోవటంతో దర్శకుడు గుణశేఖర్ ఓబుల్ రెడ్డి పాత్ర గురించి నాకు చెప్పారు. నాకు ఆసక్తిగా అనిపించి చేస్తానని చెప్పాను. ఆ తరువాత ప్రకాశ్‌రాజ్‌కి డేట్లు సర్దుబాటు కావడంతో ఆయనే చేసేశారు.
జనరల్‌గా నెగెటివ్ సెన్స్‌లో వాడతాం ‘పక్కా కమర్షియల్’ అనే పదాన్ని.. అసలు ఈ చిత్రం ఎలా ఉంటుంది?
గోపీచంద్: చాలా వినోదభరితంగా ఉంటుంది. ఇది నా దగ్గరికెప్పుడో రావాల్సిన కథ. ‘రణం’, ‘లౌక్యం’ తరువాత నేను ఫుల్ టైం కామెడీ చేసిన చిత్రం ఇదే. ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) చిత్రంలో ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేసే అన్ని అంశాలు ఉంటాయి.
మారుతి: ప్రస్తుతం ప్రేక్షకులు జడ్జిమెంట్ చాలా వేగంగా ఇస్తున్నారు. వాళ్ల వేగానికి తగినట్లు మనం సినిమా పాయింట్‌ను చెప్పగలగాలి. అందులో భాగంగానే మేము ముందే ‘పక్కా కమర్షియల్’ అని చెప్పేశాం.
మీరిద్దరూ ఈ సినిమా వర్క్ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా?
గోపీచంద్: చాలా సరదాగా సాగిపోయింది. అందరం బాగా ఎంజాయ్ చేశాం. అంతే ఉత్సాహంగా సినిమాలోనూ నటించాం.
మారుతి: నిజానికి గోపిచంద్ అన్నతో ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది. ఆయన సెట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. సీన్లలో నటించేటప్పుడు ఆశ్చర్యం కలిగేది ఆయనలోని నటుడిని చూసి. బయట ఉండే క్యాజువల్ గోపిచంద్‌ని మీరు ‘పక్కా కమర్షియల్’లో చూడబోతున్నారు.
ఇండస్ట్రీలో దర్శకుడిగా ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఎలా సాధ్యమైంది?
మారుతి: పట్టుదల ద్వారానే.. ఒకసారి ఒక డైరెక్టర్ నన్ను ‘నువ్వు డైరెక్టర్ అయితే తెలుస్తుంది.. నువ్వు తియ్ తక్కువ బడ్జెట్లో ఇలాంటి సినిమా’ అన్నారు. నేను వెంటనే ‘ఈ రోజుల్లో’ తీసి చూపించాను. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌కి ఆయన్ని పిలిచాను. యాభై లక్షలతో తీసిన సినిమా అది.
‘పక్కా కమర్షియల్’కి మీరు దర్శకుడా? నిర్మాత?
మారుతి: నా ప్రతి సినిమాకి నేనే నిర్మాతగా వ్యవహరిస్తాను. దర్శకుడిగా నన్ను నేను పరిశీలించుకోవడానికి, ఎటువంటి అభద్రతాభావానికి గురవ్వకుండా ఉండటానికి నా సినిమాలని నేనే పర్యవేక్షించుకుంటాను.
‘పక్కా కమర్షియల్’ చిత్రంపై చివరిగా ప్రేక్షకులకు మీరు చెప్పేదేంటి?
మారుతి: గోపీచంద్-మారుతి కాంబినేషన్ చాలా చక్కగా కుదిరింది. జులై1న విడుదలవుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా. మీరంతా సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని హామీ ఇస్తున్నాం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్