Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’ ఫ్లాప్‌పై ఆమిర్ ఆగ్రహం.. దర్శకుడు ఏమన్నాడంటే..?
ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన ‘లాల్‌సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమిర్ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముంబయి: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. దీంతో చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్‌పై ఆమిర్ ఆగ్రహంగా ఉన్నట్లు గత కొన్నిరోజులుగా ఆంగ్ల పత్రికల్లో కథనాలు దర్శనమిస్తున్నాయి. సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం లేదని నెటిజన్లూ అనుకుంటున్నారు.
దీనిపై తాజాగా దర్శకుడు అద్వైత్ పెదవి విప్పారు. ఆమిర్‌తో దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఆయన.. ‘‘ఆమిర్‌కు నాకు మధ్య విభేదాలున్నాయని అనుకుంటున్న వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. జీనీ - అలాద్దీన్, బాలు - మోగ్లీ, అమర్ - ప్రేమ్ లాంటి అనుబంధం మా మధ్య ఉంది’’ అని పేర్కొన్నారు. అద్వైత్ పెట్టిన పోస్ట్‌తో నెట్టింట జరుగుతోన్న చర్చకు తెరపడుతుందేమో చూడాలి. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. కరీనా కపూర్ కథానాయిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM