BAFTA: భారతీయ డాక్యుమెంటరీకి ‘బాఫ్టా’ నామినేషన్‌

అంతర్జాతీయ పురస్కారం ‘బాఫ్టా’ (BAFTA) అవార్డుల్లో భారతీయ డాక్యుమెంటరీ చిత్రం నామినేషన్‌ దక్కించుకుంది. సౌనక్‌ సేన్‌ రూపొందించిన ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ (All That Breathes) 2023 బాఫ్టా పురస్కారాల కోసం ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో నామినేషన్‌ దక్కించుకుంది.

Updated : 20 Jan 2023 07:03 IST

అంతర్జాతీయ పురస్కారం ‘బాఫ్టా’ (BAFTA) అవార్డుల్లో భారతీయ డాక్యుమెంటరీ చిత్రం నామినేషన్‌ దక్కించుకుంది. సౌనక్‌ సేన్‌ రూపొందించిన ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ (All That Breathes) 2023 బాఫ్టా పురస్కారాల కోసం ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో నామినేషన్‌ దక్కించుకుంది.  గాయపడ్డ పక్షుల్ని రక్షించడమే లక్ష్యంగా జీవించే ఇద్దరు అన్నదమ్ముల కథతో దిల్లీ నేపథ్యంలో సాగుతుంది. ఈ విభాగంలో ఆల్‌ బ్యూటీ అండ్‌ ది బ్లడ్‌షెడ్‌’, ‘ఫైర్‌ ఆఫ్‌ లవ్‌’, ‘మూన్‌ఏజ్‌ డే డ్రీమ్‌’, ‘నవన్లీ’ నామినేషన్లు దక్కించుకున్నాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు దక్కని చోటు: ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్న రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం ‘బాఫ్టా’లో నామినేషన్‌ దక్కించుకోలేకపోయింది. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలో లాంగ్‌ లిస్ట్‌లో ఉన్న ఈ చిత్రం నామినేషన్‌కు వచ్చేసరికి వెనకబడింది. ‘ఆల్‌ క్వాయిట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’, ‘అర్జెంటీనా 1985’, ‘కోర్సేజ్‌’, ‘డెసిషన్‌ టు లీవ్‌’, ‘ది క్వాయిట్‌ గర్ల్‌’ చిత్రాలు నామినేషన్‌ దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 19న ఈ పురస్కార వేడుక జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని