Naresh: నరేశ్‌ కొత్త ప్రాజెక్ట్ ఇదే..!

తనదైన కామెడీ టైమింగ్‌, పంచులతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేష్‌. కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘మహర్షి’, ‘నాంది’ వంటి చిత్రాలతో తనలోని నటుడ్ని....

Published : 30 Jun 2021 14:07 IST

హైదరాబాద్‌: తనదైన కామెడీ టైమింగ్‌, పంచులతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే హీరో అల్లరి నరేశ్‌. కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘మహర్షి’, ‘నాంది’ వంటి చిత్రాలతో తనలోని నటుడ్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేశారు. ఈ నేపథ్యంలోనే నరేశ్‌ తన తదుపరి చిత్రాన్ని తాజాగా ప్రకటించారు.

మల్లంపాటి సతీష్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నరేశ్‌ కథానాయకుడిగా నటించనున్నారు. మహేశ్‌ కోనేరు నిర్మాత. నరేశ్‌ 58వ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. బుధవారం నరేశ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని