RRR: ఇది చిన్న విషయం కాదు.. భారతీయులంతా సెలబ్రేట్‌ చేసుకోవాలి: అల్లు అరవింద్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాకు ఆస్కార్‌ వస్తుందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) అన్నారు. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి మాట్లాడారు.

Updated : 17 Feb 2023 12:28 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)కు ఆస్కార్‌ కచ్చితంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని భారతీయులంతా కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలన్నారు. ‘‘ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్ అవార్డు (Golden Globes 2023) గెలుచుకుంది. ఈ సినిమా ఆస్కార్‌ కూడా గెలుచుకుంటుందనే నమ్మకం నాకు ఉంది. ఆ అవార్డు రాజమౌళి (Rajamouli) సినిమాకు వచ్చిన గుర్తింపు గానే కాకుండా తెలుగు సినిమాకు, భారతీయ సినిమాకు దక్కిన గౌరవంగానూ చూడాలి. భారతదేశం నుంచి ఓ సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరినందుకు మనమంతా గర్వపడాలి. ఆస్కార్‌ నామినేషన్‌లో చోటు దక్కించుకోవడమన్నది చిన్న విషయం కాదు. ఇది సినిమా పరిశ్రమకు గొప్ప ప్రోత్సాహంలాంటిది’’ అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధిస్తున్న అరుదైన విజయాలను ఆస్వాదించాలని అల్లు అరవింద్‌ (Allu Aravind) కోరారు.

విడుదలైన దగ్గరి నుంచి ఎన్నో సంచలనాలు సృష్టిస్తోన్న ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా ఆస్కార్‌కు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. మార్చి 13న జరగనున్న ఆస్కార్‌ వేడుక కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అవార్డు రావాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని