Allu Arha: మరో స్టార్‌ హీరో సినిమాలో నటించనున్న అల్లు అర్హ..!

టాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాలో అల్లు అర్హ(Allu Arha) ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరో స్టార్‌ హీరో సినిమాలోనూ అర్హ నటించనుందని వార్తలు వస్తున్నాయి. 

Published : 04 Jan 2023 17:42 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌(Allu Arjun) ముద్దుల కూతురు అల్లు అర్హ(Allu Arha) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని అల్లు అర్జున్‌ దంపతులు సోషల్‌మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తన అల్లరితో అందరినీ ఆకట్టుకునే అర్హకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తనకు సంబంధించిన ఏ వీడియో అయినా క్షణాల్లో వైరల్‌ అవుతుంది. ఇక ఈ చిన్నారి త్వరలోనే వెండితెరపై మెరవనున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాలో అర్హ ప్రత్యేక పాత్రలో నటించింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా అర్హకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

అర్హ టాలీవుడ్‌లో మరో సినిమాలో నటించనుందని టాక్‌. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) దర్శకత్వంలో మహేశ్‌ నటిస్తున్న సినిమా(SSMB28)లో అర్హ కనిపించనుందంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పూజా హెగ్డే (Pooja Hegde) చిన్నప్పటి పాత్రలో అర్హ నటించనుందట. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్‌ అవుతోంది. ఇక మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ ఓ  సినిమా(SSMB29) చేయనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని