Allu Arjun: Arya ఎన్నో జీవితాల్ని మార్చింది 

‘ఫీల్‌ మై లవ్‌’ అంటూ ‘ఆర్య’గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Published : 07 May 2021 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫీల్‌ మై లవ్‌’ అంటూ ‘ఆర్య’గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన మనసులో మాట పంచుకున్నాడు బన్ని.  ‘‘ఈ సినిమా ఎందరో జీవితాలని మార్చింది. నటుడిగా నాకు, దర్శకుడిగా సుకుమార్‌కి, నిర్మాతగా దిల్‌రాజుకి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌కి, డీఓపీగా రత్నవేలుకి, డిస్ట్రిబ్యూటర్‌గా బన్ని వాసుకి ఇంకా చాలామందికి మంచి గుర్తింపునిచ్చింది. మా అందరి కెరీర్‌లో మైలురాయిగా నిలిచే చిత్రం ‘ఆర్య’’ అని పేర్కొన్నారు.

దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన తొలి చిత్రమిదే. అప్పటి వరకు ప్రేక్షకులు చూడని కొత్త తరహా ప్రేమకథని చూపించి మంచి విజయం అందుకున్నారాయన. నాయిక అను మెహతా అందం, అభినయం కుర్రకారుని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం తర్వాత సుకుమార్- అల్లు అర్జున్‌ ‘ఆర్య 2’ తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో హ్యాట్రిక్‌కి సిద్ధమవుతున్నారు. గత చిత్రాలకు భిన్నంగా ఈసారి ప్రేమకథని పక్కకుపెట్టి యాక్షన్‌ బాట పట్టారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. రష్మిక నాయిక.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని