Allu Arjun: నాలుగోసారి అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌..!

అల్లు అర్జున్‌ (Allu Arjun) - త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.  మరోసారి ఈ కాంబో అలరించనుందని టాక్‌ వినిపిస్తోంది.

Published : 25 May 2023 16:12 IST

హైదరాబాద్‌: తన స్టైల్‌తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్‌ (Allu Arjun). ఏకంగా ఐకాన్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన మాటలతో, డైలాగులతో మాయ చేస్తూ ప్రేక్షకులతో ఈలలు వేయించే దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram). వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి సూపర్‌ హిట్‌ అయ్యాయి. వాటిల్లోని పంచ్‌ డైలాగులు ఇప్పటికీ సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. తాజాగా ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది.

వీళ్లిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే మరో సినిమా తెరకెక్కనుందని టాక్‌ వినిపిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్‌ కూడా సిద్ధమైందట. భారీ స్థాయిలో దీన్ని రూపొందించనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్‌ తొలి పాన్‌ ఇండియా మూవీగా ఇది రానుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే బన్నీతో చాలాసార్లు చర్చలు కూడా జరిపారట. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ‘పుష్ప2’ (Pushpa 2) షూటింగ్‌ పూర్తి కాగానే బన్నీ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అవుతారని అంటున్నారు. తాజాగా ‘2018’ సినిమా ప్రమోషన్స్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘2024లో అల్లు అర్జున్‌తో గీతాఆర్ట్స్‌లో ఓ సినిమా చేస్తాం’’ అని చెప్పిన మాటలు ఈ వార్తకు బలాన్నిచ్చాయి.

ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) ఇటీవల హిందీలో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి తీయనున్న సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం అల్లు అర్జున్‌ నటిస్తోన్న ‘పుష్ప2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీని ఫస్ట్‌లుక్‌, వీడియోలతో సినీ ప్రియుల్లో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని