Koffee With Karan: ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’లో సందడి చేయనున్న సౌత్‌ స్టార్స్‌..!

ప్రముఖ బాలీవుడ్‌ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ సీజన్‌8 (Koffee With Karan 8)లో సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ సందడి చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోలు కరణ్‌తో కబుర్లు చెప్పనున్నారని టాక్‌.

Published : 31 Mar 2023 17:30 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ (Bollywood) షో అయినా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) కార్యక్రమం. ఇప్పటికే 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా.. సీజన్‌ 8 ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెక్ట్స్‌ సీజన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ సారి ఈ టాక్‌ షోలో ఎక్కువమంది సౌత్‌ స్టార్‌లు పాల్గొననున్నారట.

ఇటీవల దక్షిణాది సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన సౌత్‌ హీరోలు కొందరు సీజన్‌8లో మెరవనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. వీరిలో అల్లు అర్జున్‌ (Allu Arjun), యశ్‌ (Yash), రిషబ్‌ శెట్టి (Rishab Shetty) పేర్లు ప్రచారం అవుతున్నాయి. ఈ దక్షిణాది హీరోలతోపాటు వారి భార్యలు కూడా ఈ షోకు వస్తున్నారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక సీజన్‌7కు తప్ప అన్ని సీజన్లలో కరణ్‌తో కలిసి బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) సందడి చేశాడు. సీజన్‌7లో మాత్రం ఈ కింగ్‌ ఖాన్‌ పాల్గొన లేదు. దీంతో షారుక్‌ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అందుకే సీజన్‌8 ప్రారంభ ఎపిసోడ్‌ను షారుక్‌తో ప్లాన్‌ చేశాడట కరణ్‌. ఇటీవల ‘పఠాన్‌’తో షారుక్‌ సూపర్‌ హిట్‌  అందుకున్న విషయం తెలిసిందే. సీజన్‌8 సెప్టెంబర్‌లో మొదలుకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు