Allu Arjun: కల్యాణ్‌రామ్‌ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్‌

నటుడు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) అంటే తనకెంతో గౌరవమని ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) అన్నారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ‘బింబిసార’కు(Bimbisara) ప్రేక్షకుల నుంచి స్పందనపై అల్లు అర్జున్‌ ట్వీట్స్‌ చేశారు..

Published : 08 Aug 2022 02:26 IST

హైదరాబాద్‌: నటుడు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) అంటే తనకెంతో గౌరవమని ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) అన్నారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ‘బింబిసార’కు(Bimbisara) ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందనపై అల్లు అర్జున్‌ ట్వీట్లు చేశారు. ‘బింబిసార’పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు కల్యాణ్‌రామ్‌ ఎప్పుడూ ముందుంటారని బన్నీ తెలిపారు. ‘‘బింబిసార’.. ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రమిది. కల్యాణ్‌రామ్‌ నటన ప్రభావితం చేసేలా ఉంది. తొలిప్రయత్నంలోనే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన వశిష్ఠకు, ఇతర సభ్యులు, సాంకేతిక బృందానికి నా హృదయపూర్వక శుభాభినందనలు. ఇక.. కొత్త టాలెంట్‌ని, విభిన్నమైన చిత్రాలను ఇండస్ట్రీకి అందిస్తోన్న కల్యాణ్‌రామ్‌ అంటే నాకెప్పటికీ గౌరవమే’’ అని బన్నీ పేర్కొన్నారు.

టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మూవీ ‘బింబిసార’. ఇందులో కల్యాణ్‌రామ్‌ త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా క్రూరమైన పాత్రలో నటించారు. రాజ్యాధికార కాంక్షతో ఎంతోమందిని ఇబ్బందులకు గురిచేసిన ఓ రాజు.. టైమ్‌ ట్రావెల్‌ చేసి.. తాను చేసిన తప్పులను అర్థం చేసుకుని వాటిని సరిదిద్దుకోవడం అనే ఆసక్తికర అంశాలతో ఇది రూపుదిద్దుకుంది. సంయుక్తా మేనన్‌, కేథరిన్‌ కథానాయికలు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రెండు రోజుల్లో రూ.20 కోట్ల గ్రాస్‌ సొంతం చేసుకున్నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు