Pushpa The Rule: ‘పుష్ప2’ లేటెస్ట్‌ ఫొటో షేర్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌..

పుష్ప... ది రైజ్‌’ (Pushpa The Rise) సాధించిన విజయం అంతాఇంతా కాదు. దాని కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa 2). ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పుష్ప సినిమాటోగ్రాఫర్‌ షేర్‌ చేసిన ఫొటో చూసి అల్లు అర్జున్‌ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. 

Published : 31 Oct 2022 01:51 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెన్స్‌ల్లో ‘పుష్ప: ది రూల్‌’(Pushpa The Rule) ఒకటి. దీని గురించి మేకర్స్‌ ప్రకటించిన దగ్గరి నుంచి అల్లు అర్జున్‌ అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టు ఈసారి మరిన్ని హంగులతో రూపొందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. లొకేషన్లు, విజువల్‌ ఎఫెక్ట్స్, ఇతరత్రా సాంకేతికత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఇక తాజాగా పుష్ప సినిమాటోగ్రాఫర్‌ మిరోస్లా కూబా బ్రొజెక్‌(Miroslaw Kuba Brozek)తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. అల్లుఅర్జున్‌ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటో షేర్‌ చేసిన ఆయన ‘‘సాహసం ప్రారంభమైంది. ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌కు ధన్యవాదాలు..’’అని రాశారు. ఇక ఈ ఫొటో చూసిన బన్నీ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. కామెంట్‌ల రూపంలో వాళ్ల ఆనందాన్ని తెలియచేస్తున్నారు. ‘2024లో నేషనల్‌ అవార్డుకు ఈ ఒక్క ఫొటో చాలు’అని ఒకరంటే. ‘ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి సిద్ధమవుతున్న బన్నీ’  అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. సోషల్‌మీడియాలో రకరకాల మీమ్స్‌ చేసి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని