Allu Arjun: స్టేజ్‌పై ‘ఊ అంటావా..’ పాటకు డ్యాన్స్‌ వేసిన బన్నీ.. వీడియో షేర్‌ చేసిన సమంత

హైదరాబాద్‌లో జరిగిన ఓ లైవ్‌ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ (Allu Arjun) హాజరయ్యాడు. అందులో ‘ఊ అంటావా..’ పాటకు స్టేజ్‌ ఎక్కి డ్యాన్స్‌ చేశాడు.

Published : 05 Mar 2023 14:24 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్ ‌(Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిన విషయమే. అందులోని పాటలు, డైలాగులు ఇప్పటికీ సోషల్‌మీడియాలో హోరెత్తుతున్నాయి. ఎక్కడ ఏ ఈవెంట్‌ జరిగినా ఈ పాటలు ఉండాల్సిందే. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సింగర్‌ మార్టిన్‌ గ్యారిక్స్‌ (Martin Garrix) పుష్ప పాటలతో సందడి చేశాడు. దీనికి హాజరైన బన్నీ ‘ఊ అంటావా’ పాటకు స్టేజ్‌ ఎక్కి చిందేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.

ప్రముఖ సింగర్‌ మార్టిన్‌ గ్యారిక్స్‌ (Martin Garrix) హైదరాబాద్‌లో తాజాగా ఓ ఈవెంట్‌ నిర్వహించాడు. దీనికి వేల మంది సంగీత ప్రియులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ కూడా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పాట మధ్యలో బన్నీ స్టేజ్‌ మీదకు వచ్చి డ్యాన్స్‌ వేయడంతో ఆడియన్స్‌ కేరింతలు కొట్టారు. అలాగే మార్టిన్‌ గ్యారిక్స్‌తో కలిసి దిగిన ఫొటోలను అల్లు అర్జున్‌ తన సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘‘ఎంతో ఆనందంగా ఉంది. తగ్గేదెలే’’ అని రాశాడు. ఈ వీడియోను సమంత కూడా షేర్‌ చేసింది. ‘ఈ పాట ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌’ అని పేర్కొంది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప2’ (Pushpa2) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే వైజాగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీని తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇక సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలోనూ ఓ పాన్‌ ఇండియా సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని టీ-సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు