Allu Arjun: బన్నీ మానియా.. ఇన్‌స్టాలో పెరుగుతున్న ఫాలోవర్స్‌!

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌ 17న థియేటర్లలో పాన్‌ ఇండియాగా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో బన్నీకి క్రేజ్‌ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాలో ఆయన్ను ఫాలో అవుతున్న

Published : 29 Jan 2022 01:57 IST

హైదరాబాద్‌: సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో బన్నీకి క్రేజ్‌ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాలో ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీకి రెండు వారాల్లోనే దాదాపు 10లక్షల ఫాలోవర్స్‌ పెరిగారు. జనవరి 14న తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌ సంఖ్య 15 మిలియన్‌కి చేరుకోవడంతో అభిమానులకు ధన్యావాదాలు చెబుతూ బన్నీ ఓ పోస్టు పెట్టారు. ఇప్పుడు ఆ సంఖ్య 16 మిలియన్లకు చేరువలో ఉంది. ఇన్‌స్టాలో అత్యధిక మంది ఫాలో అవుతున్న దక్షిణాది హీరో బన్నీనే కావడం విశేషం. 

శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించారు. ఓ సాధారణ కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ సిండికేట్‌కు అధినేతగా ఎలా ఎదిగాడు అనేది ‘పుష్ప ది రైజ్‌’లో చూపించారు. దీనికి రెండో భాగం కూడా తెరకెక్కబోతుంది. పుష్పరాజ్‌పై ఆగ్రహంగా ఉన్న పోలీస్‌ అధికారి భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహద్‌ ఫాజిల్‌), ద్రాక్షాయణి (అనసూయ) అతన్ని నాశనం చేయడానికి ఎలాంటి ప్లాన్స్‌ వేయనున్నారు? వాటిని పుష్ప ఎలా ఎదుర్కోనున్నాడు?.. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో పార్ట్‌ 1కి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్‌’ సిద్ధం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు