
Samantha-Allu Arjun: టాప్ సెర్చ్‌లో అల్లు అర్జున్, సమంత.. ఏ స్థానంలో ఉన్నారంటే!
ఇంటర్నెట్‌డెస్క్: ఈ ఏడాది అత్యధిక మంది ఇంటర్నెట్లో వెతికిన వారిలో తెలుగు నటులు అల్లు అర్జున్, సమంత చోటు దక్కించుకున్నారు. తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో బన్నికి మంచి క్రేజ్ ఉండగా.. దక్షిణాది చిత్రాలతో పాటు, ‘ఫ్యామిలీమ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. 2021వ సంవత్సరానికి గానూ ప్రముఖ సెర్చింజన్ యాహూ విడుదల ర్యాంకుల్లో సెలబ్రిటీల కోసం ఇంటర్నెట్లో శోధించిన వారిలో తెలుగు నుంచి వీరిద్దరూ ఉన్నారు.
ఇక హిందీ చిత్రసీమ నుంచి దివంగత నటుడు సిద్దార్థ్ శుక్లా, నటి కరీనా కపూర్ గురించి అత్యధికంగా వెతికారు. ఇక పురుష సెలబ్రెటీల జాబితాలో మొదటి స్థానంలో సిద్ధార్థ్ శుక్లా, రెండో స్థానంలో సల్మాన్ ఖాన్, మూడోస్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ఇక మహిళా సెలబ్రెటీల ర్యాంకుల జాబితా మొదటి స్థానంలో కరీనా కపూర్, కత్రినా కైఫ్, ఆలియా భట్.. రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పదో స్థానంలో సమంత నిలిచారు. 2015లో వచ్చిన త్రివిక్రమ్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో సమంత- అల్లు అర్జున్ కలిసి నటించారు. ఈ ఏడాది సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘పుష్ప’లో బన్ని సరసన ఐటమ్ సాంగ్‌లో సమంత ఆడిపాడింది.