Allu arjun: షారుక్‌ ‘జవాన్‌’లో అల్లు అర్జున్‌.. డైరెక్టర్‌ అట్లీ అదిరిపోయే ప్లాన్‌..!

అట్లీ (Atlee) దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ నటిస్తోన్న చిత్రం ‘జవాన్‌’ (Jawan). భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ వైరల్‌ అవుతోంది.

Published : 13 Feb 2023 17:27 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ (Shahrukh Khan) ‘పఠాన్‌’ సినిమా అందించిన విజయాన్ని సెలబ్రెట్‌ చేసుకుంటున్నాడు. ఈ చిత్రం తన కెరీర్‌లోనే మంచి వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో చేరింది. ఈ జోష్‌తోనే షారుక్‌ తన తర్వాత సినిమా మొదలుపెట్టేశాడు. అట్లీ (Atlee) దర్శకత్వంలో రానున్న  ‘జవాన్‌’ (Jawan) సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని తారాగణాన్ని ప్రకటించి సినీప్రియుల్లో ఆసక్తి పెంచేసింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతూ.. ఇటు టాలీవుడ్‌ అటు బాలీవుడ్‌ రెండు చోట్లా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

షారుక్‌ సరసన లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తోన్న ఈ సినిమాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) నటించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ‘జవాన్‌’లో అతిథి పాత్ర కోసం బన్నీని చిత్రబృందం సంప్రదించిందనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఒకవేళ బన్నీ ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు అంగీకరిస్తే బీటౌన్‌తో పాటు ఇటు తెలుగులోనూ సినిమా హిట్‌ అవుతుందని అట్లీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు కానీ వార్త మాత్రం వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం అల్లుఅర్జున్‌ ‘పుష్ప2’ (Pushpa The Rule) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే వైజాగ్‌లో ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలోనే ఈ షూటింగ్‌లో నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika) పాల్గొననుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని