Allu Arjun: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. 20 ఏళ్ల సినీ ప్రస్థానంపై బన్నీ పోస్ట్
సినీరంగ ప్రవేశం చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) తన అభిమానుల కోసం స్పెషల్ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా బన్నీకి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హైదరాబాద్: ‘గంగోత్రి’ (Gangotri) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్ (Allu Arjun). నాటి నుంచి ప్రతి సినిమాకు వైవిధ్యం చూపుతూ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘పుష్ప’ (Pushpa) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ ఐకాన్ స్టార్ సినీరంగ ప్రవేశం చేసి నేటితో రెండు దశబ్దాలు పూర్తయింది. ఈ సందర్భంగా బన్నీ తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ సోషల్‌మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేశాడు.
‘‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి నేటితో 20 ఏళ్లు పూర్తయింది. మీరందరూ ప్రేమాభిమానాలతో నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. నేడు నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రేక్షకులు, అభిమానులే కారణం. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను’’ అంటూ తన అభిమానులకు బన్నీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సినిమాలపై మీకున్న అంకితభావమే మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిందంటూ’ కామెంట్స్ పెడుతున్నారు. ‘గ్లోబల్ ఐకాన్ స్టార్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు.
ఇక పాన్ ఇండియా హీరోగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బన్నీ తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాడు. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకొంటూ వారిలో జోష్ నింపుతుంటాడు. ప్రస్తుతం ‘పుష్ప2’ (Pushpa 2) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చెయ్యనున్నారు. 3 నిమిషాలు ఉండే ఈ టీజర్‌లో బన్నీ ఎలా కనిపిస్తాడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Biparjoy : మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపర్ జోయ్
-
Sports News
Rishabh Pant: టీమ్ ఇండియా కోసం పంత్ మెసేజ్..!
-
World News
Donald Trump: మరిన్ని చిక్కుల్లో ట్రంప్.. రహస్య పత్రాల కేసులో నేరాభియోగాలు
-
Politics News
Eatala Rajender : దిల్లీ బయలుదేరిన ఈటల రాజేందర్
-
Movies News
Vimanam Movie Review: రివ్యూ: విమానం.. సముద్రఖని, అనసూయల చిత్రం ఎలా ఉంది?
-
World News
Long Covid: దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు