Allu arjun: ఫొటో షూట్ రద్దు చేసిన బన్నీ.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు
వైజాగ్‌లో అల్లు అర్జున్ (Allu arjun) ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు. కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అవ్వడంతో ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
హైదరాబాద్: ప్రతి సినిమాతో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఐకాన్ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్(Allu Arjun). ‘పుష్ప’(Pushpa) సినిమాతో పాన్ ఇండియా యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ పుష్పరాజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. బన్నీ ఎక్కడికి వస్తే అక్కడికి చేరుకుంటారు ఆయన అభిమానులు. ఈ హీరో నటిస్తోన్న ‘పుష్ప2’ (Pushpa 2 The Rule) సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ గ్యాప్‌లో బన్నీ అభిమానులతో కలిసి ఫొటోషూట్ ఏర్పాటు చేశారు. ఆయన్ని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే కొందరి అత్యుత్సాహం వల్ల ఆ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. దీంతో చేసేదేమీ లేక ఫొటో షూట్ రద్దు చేశారు.
బన్నీతో ఫొటో దిగేందుకు వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. కొందరు ఏకంగా స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లుఅర్జున్ ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కోసం సినీ ప్రియులతో పాటు పాన్ ఇండియా ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదరు చేస్తున్నాయి. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగంలో ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil)విలన్‌గా కనిపించారు. ఇక రెండో భాగంలో ఆయనతో పాటు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కూడా కనిపించనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
UP: గ్యాంగ్‌స్టర్ తరలింపులో ఉత్కంఠ.. ఆవును ఢీకొన్న కాన్వాయ్..!
-
General News
Andhra news: రావాల్సిన డబ్బులే అడుగుతుంటే.. కాకిలెక్కలు చెబుతున్నారు: బొప్పరాజు
-
Politics News
KTR: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది: మంత్రి కేటీఆర్
-
Movies News
Samantha: ‘సామ్.. మళ్లీ ప్రేమలో పడొచ్చుగా..!’ నెటిజన్ ట్వీట్‌కు సామ్ సమాధానం ఏమిటంటే..?
-
Crime News
Crime News: పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో ముగ్గురి అరెస్టు: ఎస్పీ
-
India News
Uddhav Thackeray: ఆయన్ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్..!