Filmfare: ఫిలింఫేర్‌ అవార్డుల్లో ‘పుష్ప’ హవా..!

67వ ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ఎంతో వేడుకగా జరిగింది. అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ ఈ ఏడాది అత్యధికంగా అవార్డులు సొంతం చేసుకుంది.  

Updated : 10 Oct 2022 08:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ భారత చలన చిత్రరంగంలో విశేషంగా భావించే ‘ఫిలింఫేర్‌’ (Filmfare) అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. కరోనా పరిస్థితులతో  గడిచిన కొన్నేళ్లు నిరాడంబరంగా జరిగిన ఈ వేడుక..  ఈ ఏడాది స్టార్‌ నటీనటుల సమక్షంలో ఘనంగా జరిగింది. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌,  దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌కు ఈ ఏడాది ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారం వరించింది.

ఈసారి ఫిలింఫేర్‌లో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన టాలీవుడ్‌ చిత్రం ‘పుష్ప’ హవా నడిచింది. మొత్తం ఏడు విభాగాల్లో ఆ చిత్రం సత్తా చాటింది. తమిళంలో సూర్య కథానాయకుడిగా నటించిన ‘సూరారై పోట్రు’.. ఏడు అవార్డులను దక్కించుకుంది.

ఫిలింఫేర్‌ విజేతలు వీరే..!

తెలుగు

​​​​ ఉత్తమ చిత్రం: పుష్ప - ది రైజ్
​​​​ ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (పుష్ప - ది రైజ్)
​​​​ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప - ది రైజ్‌)
​​​​ ఉత్తమ నటి: సాయిపల్లవి (లవ్‌స్టోరీ)
​​​​ ఉత్తమ సహాయనటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
​​​​ ఉత్తమ సహాయనటి:  టబు (అల వైకుంఠపురములో)
​​​​ ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప - ది రైజ్)
​​​​ ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (జాను) (లైఫ్‌ ఆఫ్‌ రామ్‌)
​​​​ ఉత్తమ గాయకుడు: సిద్ద్‌ శ్రీరామ్‌ (పుష్ప ది రైజ్‌ - శ్రీవల్లి)
​​​​ ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్‌ (పుష్ప ది రైజ్‌ - ఊ అంటావా మావ)
​​​​ విమర్శకుల ఉత్తమ నటి: సాయిపల్లవి (శ్యామ్‌సింగ్‌రాయ్‌)
​​​​ విమర్శకుల ఉత్తమ నటుడు: నాని (శ్యామ్‌సింగరాయ్‌)
​​​​ ఉత్తమ కొరియోగ్రాఫర్‌: శేఖర్‌ మాస్టర్‌ (అల వైకుంఠపురములో - రాములో రాములా)
​​​​ ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: మిరోస్లా బ్రొజెక్ (పుష్ప - ది రైజ్)
​​​​• ఉత్తమ నూతన నటి: కృతిశెట్టి (ఉప్పెన)
​​​​• ఉత్తమ నూతన నటుడు: వైష్ణవ్‌ తేజ్‌ (ఉప్పెన)

తమిళం:

​​​​• ఉత్తమ చిత్రం: జై భీమ్‌
​​​​• ఉత్తమ దర్శకురాలు: సుధా కొంగర (సూరారైపోట్రు)
​​​​• ఉత్తమ నటుడు: సూర్య (సూరారైపోట్రు)
​​​​• ఉత్తమ నటి: లిజోమోల్‌ జోసీ (జై భీమ్‌)
​​​​• ఉత్తమ సహాయ నటుడు : పసుపతి (సార్పట్ట)
​​​​• ఉత్తమ సహాయనటుడు: ఊర్వశి (సూరారైపోట్రు)
​​​​• ఉత్తమ ఆల్బమ్‌: జీవీ ప్రకాశ్‌ (సూరారైపోట్రు)
​​​​• ఉత్తమ గేయ రచయిత‌: అరివు (సార్పట్ట)
​​​​• ఉత్తమ గాయకుడు: క్రిస్టిన్‌ జాస్‌, గోవింద్‌ వసంత (సూరారైపోట్రు)
​​​​• ఉత్తమ గాయని : ధీ (సూరారైపోట్రు)
​​​​• ఉత్తమ కొరియోగ్రాఫర్‌: దినేష్‌ కుమార్‌ (మాస్టర్‌)
​​​​• ఉత్తమ సినిమాటోగ్రఫీ: నికిత్‌ (సూరారైపోట్రు)

కన్నడ:

​​​​• ఉత్తమ చిత్రం: యాక్ట్‌ 1978

​​​​• ఉత్తమ దర్శకుడు: రాజ్‌ బి శెట్టి (గరుడ గమన వృషభ వాహన)

​​​​• ఉత్తమ నటుడు: ధనంజయ్‌ (బడవ రాస్కెల్‌)

​​​​• ఉత్తమ నటి: యజ్ఞ శెట్టి (యాక్ట్‌ 1978)

​​​​• ఉత్తమ సహాయ నటుడు: బి.సురేష (యాక్ట్‌ 1978)

​​​​• ఉత్తమ సహాయ నటి: ఉమశ్రీ (రత్నన్‌ ప్రపంచ)

​​​​• ఉత్తమ ఆల్బమ్‌: వాసుకీ వైభవ్‌ (బడవ రాస్కెల్‌)

​​​​• ఉత్తమ గేయ రచయిత: జయంత్‌ (యాక్ట్‌ 1978)

​​​​• ఉత్తమ గాయకుడు: రఘు దీక్షిత్‌ (నిన్న సనిహకే) 

​​​​• ఉత్తమ గాయని: అనురాధా భట్‌ (బిచ్చుగట్టి)

​​​​• విమర్శకుల ఉత్తమ నటి: అమృతా అయ్యంగర్‌ (బడవ రాస్కెల్‌), మిలానా నాగరాజ్‌ (లవ్‌ మాక్‌టైల్‌)

​​​​• విమర్శకుల ఉత్తమ నటుడు: డార్లింగ్‌ కృష్ణ (లవ్‌ మాక్‌టైల్‌)

​​​​• ఉత్తమ కొరియోగ్రాఫర్‌: జానీ మాస్టర్‌ (యువరత్న)

​​​​• ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: శిరీషా కాదువల్లి (రత్నన్‌ ప్రపంచ)

​​​​• ఉత్తమ నూతన నటి: ధన్య రామ్‌కుమార్‌ (నిన్న సనిహకే)

మలయాళం: 

​​​​• ఉత్తమ చిత్రం: అయ్యప్పనుమ్‌ కోషియం

​​​​• ఉత్తమ దర్శకుడు: సెన్నా హెగ్డే (Thinkalazhcha Nishchayam)

​​​​• ఉత్తమ నటుడు: బిజూ మేనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియం)

​​​​• ఉత్తమ నటి: నిమీషా (ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌‌)

​​​​• ఉత్తమ సహాయ నటుడు: జోజు జార్జ్‌ (నాయట్టు)

​​​​• ఉత్తమ సహాయ నటి: గౌరీ నందా (అయ్యప్పనుమ్‌ కోషియం)

​​​​• ఉత్తమ ఆల్బమ్‌: జయచంద్రన్‌ (సూఫియుం సుజాతయుమ్)

​​​​• ఉత్తమ గేయ రచయిత: రఫీఖ్‌ అహ్మద్‌ (అయ్యప్పనుమ్‌ కోషియం)

​​​​• ఉత్తమ గాయకుడు: షాబాజ్ (VELLAM)

​​​​• ఉత్తమ గాయని: చిత్ర (మాలిక్‌)

​​​​• విమర్శకుల ఉత్తమ నటి: కని కుస్రూతి(బిరియానీ)

​​​​• విమర్శకుల ఉత్తమ నటుడు: జయసూర్య (VELLAM)

​​​​• ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: ఖలీద్‌ (నాయట్టు)

​​​​• ఉత్తమ నూతన నటుడు: దేవ్‌ మోహన్‌ (సూఫియుం సుజాతయుమ్)

​​​​• ఉత్తమ నూతన నటి: అనగా నారాయణన్‌ (Thinkalazhcha Nishchayam)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని