Pushpa: రష్యాలో ‘పుష్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే...
గతేడాది విడుదలై సూపర్ హిట్ అయిన పుష్ప సినిమా రష్యాలో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్రబృందం ట్విట్ చేసింది.
హైదరాబాద్: మన చిత్రాలు విదేశాల్లోనూ విజయకేతం ఎగురవేస్తున్నాయి. ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు ప్రపంచదేశాల్లోనూ సత్తాచాటుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పలు దేశాల్లో బ్లాక్బాస్టర్గా నిలిచింది. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప:ది రైజ్’ ఇప్పటికే పలు భాషల్లో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ సినిమా రష్యాలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను రష్యన్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ సినిమాను రష్యన్ డబ్బింగ్ వర్షన్‌ను విడుదలచేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం తాజాగా తేదీను వెల్లడించింది. డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మూవీ టీం అభిమానులతో ముచ్చటించనుంది. దీని కోసం పుష్ప బృందం రష్యా చేరుకోనుంది.
ఇక ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మొదటి భాగం విశేషమైన విజయం సాధించడంతో రెండోభాగం పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప: ది రూల్’ను అత్యున్నత సాంకేతిక హంగులతో ముస్తాబు చేస్తోంది చిత్రబృందం. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల