Pushpa: ‘పుష్ప’ వికాసం

సందడి విషయంలో ‘పుష్ప’ తగ్గేదే లే అంటున్నాడు. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రోజూ ఓ కొత్త లుక్‌    సామాజిక మాధ్యమాల్లో విడుదలవుతోంది. శుక్రవారం కొత్త ప్రచార చిత్రంతో   ఊరించారు. ముందస్తు  ట్రైలర్‌గా ఇది విడుదలైంది.

Updated : 04 Dec 2021 11:46 IST

సందడి విషయంలో ‘పుష్ప’ తగ్గేదే లే అంటున్నాడు. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రోజూ ఓ కొత్త లుక్‌    సామాజిక మాధ్యమాల్లో విడుదలవుతోంది. శుక్రవారం కొత్త ప్రచార చిత్రంతో   ఊరించారు. ముందస్తు  ట్రైలర్‌గా ఇది విడుదలైంది. అందులో కొన్ని సన్నివేశాలు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని రోజులుగా తెరకెక్కిస్తున్న ప్రత్యేక గీతం శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 6న ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికలో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రమిది. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ హిందీతోపాటు, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ విడుదలవుతోంది. ఇందులో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటించిన విషయం తెలిసిందే. సమంత ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటించారు. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని