Allu arjun: అల్లు అర్జున్‌కు ‘పుష్ప’ లారీ గిఫ్ట్.. ఎవరిచ్చారో తెలుసా?
Allu arjun: స్టార్ హీరో అల్లు అర్జున్ ఊహించని గిఫ్ట్‌ను అందుకున్నారు. ఆ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా షేర్ చేస్తూ తెగ సంబరపడిపోయారు.
ఇంటర్నెట్‌డెస్క్: స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu arjun) అదిరిపోయే బహుమతిని అందుకున్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్ (sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’ (pushpa). ఇందులో బన్ని నటన, స్టైల్ మాస్‌ను విశేషంగా అలరించాయి. దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం ‘పుష్ప2’ (Pushpa2) సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనయుడు అల్లు అయాన్ (allu ayaan) నుంచి బన్ని సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. ‘పుష్ప’లో అల్లు అర్జున్ లారీలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కనిపిస్తారు. అలాంటి తరహా లారీ బొమ్మను బన్నికి అయాన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. కుమారుడు ఇచ్చిన గిఫ్ట్‌కు తెగ సంతోషపడిపోయిన అల్లు అర్జున్ దాన్ని ఫొటో తీసి సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘చినబాబు అయాన్ నుంచి వచ్చిన అందమైన బహుమతి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘పుష్ప’లో లారీని అలంకరించిన రీతిలోనూ ఈ బొమ్మ కూడా రంగురంగులుగా ఉంది. టాప్‌పైన ‘పుష్ప’ అని రాసి ఉంది.
‘పుష్ప’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రెండో భాగం కోసం చాలా విరామమే తీసుకున్నారు అల్లు అర్జున్. తొలిభాగానికి ఊహించని స్పందన రావడం, బాలీవుడ్‌లోనూ ‘పుష్పరాజ్’ హవా కొనసాగడంతో ‘పుష్ప: ది రైజ్’ స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దారు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే థాయిలాండ్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ జరుపుకొంటోంది. నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ‘పుష్ప’లోని నటించిన రష్మిక, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్, ధనుంజయ పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్‌లను సుకుమార్ పరిచయం చేయబోతున్నారని టాక్. అయితే, దీనిపై ఇప్పటికి చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరోవైపు ‘పుష్ప2’ గురించి అప్‌డేట్ ఇవ్వాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Dharmapuri Srinivas: అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నారు: ధర్మపురి సంజయ్
-
India News
Bilkis Bano: బిల్కిస్ బానో పిటిషన్.. భావోద్వేగాలతో తీర్పు ఇవ్వలేం: సుప్రీం
-
Sports News
Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్ డ్యాన్స్ అదరగొడతాడు: అనుష్క
-
General News
TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి
-
India News
Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌గాంధీకి నోటీసులు
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!