Allu Arjun: వరుణ్-లావణ్య నిశ్చితార్థం.. మా నాన్న ఆనాడే చెప్పారు: అల్లు అర్జున్
వరుణ్ తేజ్ (Varun Tej) - లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థాన్ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ (Allu Arjun) ఓ సరదా వీడియో షేర్ చేశారు.
హైదరాబాద్: తన బావ వరుణ్‌తేజ్ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థాన్ని ఉద్దేశిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇలా జరుగుతుందని తన తండ్రి అల్లు అరవింద్ ముందే గ్రహించారని పేర్కొంటూ స్మైలీ ఎమోజీలను అటాచ్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
లావణ్య త్రిపాఠి కథానాయికగా.. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై 2021లో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. కాగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో లావణ్య.. చక్కగా తెలుగులో మాట్లాడటాన్ని ఉద్దేశిస్తూ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తుంది. ఇక్కడే ఓ కుర్రాడిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా ఈ అమ్మాయి’’ అంటూ ఆరోజు ఆయన స్టేజ్‌పై నవ్వులు పూయించారు. వరుణ్ - లావణ్య నిశ్చితార్థమైన సందర్భంగా ఆనాటి ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన బన్నీ.. తన తండ్రి తెలివైన వారని, లావణ్య తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందని ముందే గ్రహించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ
-
Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్ సంస్థ
-
Income tax refund: ఆదాయపు పన్ను రిఫండ్స్.. ఐటీ శాఖ కీలక సూచన
-
Chandrababu Arrest: విశాఖలో తెదేపా శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు