Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 (Telugu Indian Idol 2) ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ (Allu Arjun) పాల్గొన్నారు. కంటెస్టెంట్లతో సరదాగా గడిపారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 (Telugu Indian Idol 2) దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం ఇది ముగింపు దశకు వచ్చేసింది. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్లో ఎవరు గెలుస్తారా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇక కార్యక్రమం ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వచ్చారు. కంటెస్టెంట్లతో సరదాగా గడిపి వారిలో జోష్ నింపారు. తనకు సంబంధించిన సరదా విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన మొదటి గర్ల్‌ఫ్రెండ్ పేరును చెప్పారు. కంటెస్టెంట్ శ్రుతి (Sruthi) పాట పాడడం అయ్యాక.. ‘నీ పేరు అంటే నాకు ఎంతో ఇష్టం. నా మొదటి గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే’ అని చెప్పారు. ఇంతలో గీతామాధురి ‘గర్ల్‌ఫ్రెండ్ అంటే చిన్నప్పుడు ఒకటో తరగతిలోనా’ అని అనడంతో వేదికంతా నవ్వులతో నిండిపోయింది. అల్లు అరవింద్ గురించి బన్నీ మాట్లాడుతూ.. ‘నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. నాకు అన్నీ ఇచ్చి.. నాకు కనిపించే దేవుడు మా నాన్న.. ఆయనే నాకు దేవుడు’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ‘పుష్ప’లో కేశవ్‌గా అలరించిన నటుడు జగదీశ్ తన సినిమా ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వచ్చాడు. అతడికి బన్నీ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘నువ్వు హీరోగా ‘సత్తి గాని రెండెకరాలు’ చేశావ్ కదా.. అని ‘పుష్ప2’లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయనని అంటే కుదరదు. నువ్వు మాకు కేశవే. త్వరగా షూటింగ్‌కు రా.. అందరూ ఎదురుచూస్తున్నారు’ అని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ కంటెస్టెంట్లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’ (Telugu Indian Idol 2) ప్రసారమవుతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman), గాయకుడు కార్తిక్ (Karthik), గాయని గీతామాధురి (Geetha madhuri) ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఫినాలే ఎపిసోడ్ జూన్ 3, 4 తేదీల్లో ప్రసారం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సందడి చేసిన ‘సుందరం మాస్టర్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. -
Hanuman: మరో మైలురాయిని దాటిన ‘హనుమాన్’.. ఓటీటీలోనూ కొనసాగుతోన్న హవా
‘హనుమాన్’ సినిమా ఓటీటీలో మరో మైలు రాయిని దాటింది. -
Operation Valentine: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వరుణ్ తేజ్ (Varun Tej) - మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). -
Fighter: ఓటీటీలోకి యాక్షన్ హంగామా ‘ఫైటర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. గుడ్డూ భయ్యా ఈజ్ బ్యాక్..
‘మీర్జాపూర్ 3’ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. -
New Movies and Series: ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ‘కాంతారా2’, ‘ఫ్యామిలీస్టార్’.. అమెజాన్ ప్రైమ్ క్రేజీ అప్డేట్స్
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సందడి చేయబోయే సినిమాల జాబితాను సదరు ఓటీటీ సంస్థ పంచుకుంది. -
Citadel: సమంత, వరుణ్‌ధావన్ ‘సిటడెల్’ ఇండియన్ సిరీస్ టైటిల్ ఇదే!
Citadel Honey Bunny: సమంత, వరుణ్‌ధావన్ కలిసి నటించిన ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ టైటిల్‌ను ప్రకటించారు. -
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
Hanuman ott: జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన హనుమాన్ మూవీ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
Hanuman OTT: ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్
‘హనుమాన్’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. -
Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. -
Inspector Rishi: ఓటీటీలోకి మరో హారర్ క్రైమ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నవీన్ చంద్ర నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. దీని విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. -
ETV Win: ఈటీవీ విన్లో ‘ఏం చేస్తున్నావ్?’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈటీవీ విన్ ప్రేక్షకులను అలరించేందుకు మరో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. -
Oscars 2024: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. స్ట్రీమింగ్ ఇక్కడే..
ఆస్కార్ బరిలో పోటీపడి గెలుపొందిన సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. -
Main Atal Hoon: ఓటీటీలో వాజ్‌పేయీ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Main Atal Hoon: పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ‘మై అటల్ హూ’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
Narakasura: ఓటీటీలో రక్షిత్ ‘నరకాసుర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన ‘నరకాసుర’ ఓటీటీలోకి వచ్చేసింది. -
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం.. 18 దేశాల్లో ట్రెండింగ్..
‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. -
ooru peru bhairavakona ott: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఊరు పేరు భైరవకోన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ooru peru bhairavakona ott release date: సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీలో విడుదలైంది. -
merry christmas ott: ఓటీటీలో ‘మెర్రీ క్రిస్మస్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Merry Christmas ott release date: కత్రినాకైఫ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
OTT: ఓటీటీల వల్ల దర్శకులకు ఈ టెన్షన్ తగ్గింది: రాజ్ అండ్ డీకే
దర్శకులు రాజ్ అండ్ డీకే ఓటీటీలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ