Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 (Telugu Indian Idol 2) ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ (Allu Arjun) పాల్గొన్నారు. కంటెస్టెంట్‌లతో సరదాగా గడిపారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 (Telugu Indian Idol 2) దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం ఇది ముగింపు దశకు వచ్చేసింది. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్‌లో ఎవరు గెలుస్తారా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇక కార్యక్రమం ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వచ్చారు. కంటెస్టెంట్‌లతో సరదాగా గడిపి వారిలో జోష్ నింపారు. తనకు సంబంధించిన సరదా విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన మొదటి గర్ల్‌ఫ్రెండ్ పేరును చెప్పారు. కంటెస్టెంట్ శ్రుతి (Sruthi) పాట పాడడం అయ్యాక.. ‘నీ పేరు అంటే నాకు ఎంతో ఇష్టం. నా మొదటి గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే’ అని చెప్పారు. ఇంతలో గీతామాధురి ‘గర్ల్‌ఫ్రెండ్ అంటే చిన్నప్పుడు ఒకటో తరగతిలోనా’ అని అనడంతో వేదికంతా నవ్వులతో నిండిపోయింది. అల్లు అరవింద్ గురించి బన్నీ మాట్లాడుతూ.. ‘నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. నాకు అన్నీ ఇచ్చి.. నాకు కనిపించే దేవుడు మా నాన్న.. ఆయనే నాకు దేవుడు’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ‘పుష్ప’లో కేశవ్‌గా అలరించిన నటుడు జగదీశ్ తన సినిమా ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వచ్చాడు. అతడికి బన్నీ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘నువ్వు హీరోగా ‘సత్తి గాని రెండెకరాలు’ చేశావ్ కదా.. అని ‘పుష్ప2’లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయనని అంటే కుదరదు. నువ్వు మాకు కేశవే. త్వరగా షూటింగ్‌కు రా.. అందరూ ఎదురుచూస్తున్నారు’ అని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ కంటెస్టెంట్‌లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’ (Telugu Indian Idol 2) ప్రసారమవుతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman), గాయకుడు కార్తిక్ (Karthik), గాయని గీతామాధురి (Geetha madhuri) ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఫినాలే ఎపిసోడ్ జూన్ 3, 4 తేదీల్లో ప్రసారం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)