
Rowdy Boys: దిల్‌రాజు నా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి: అల్లు అర్జున్
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుంటుంబం నుంచి హీరోగా పరిచయమవుతున్నారు ఆశిష్. ఆయన నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘డైట్ నైట్’ సాంగ్ విడుదల వేడుకను సోమవారం నిర్వహించింది. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ పాటను విడుదల చేశారు.
అనంతరం అల్లు అర్జున్ వేడుకనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుక నాకు చాలా స్పెషల్. ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్ అని భావిస్తున్నా. ‘ఆర్య’ సినిమాతో నా కెరీర్ మారింది. ఆ సినిమా లేకపోతే నేను లేను. నిర్మాత దిల్ రాజు గారు లేకపోతే ఆ సినిమా లేదు. దిల్‌రాజు గారు నా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి. ఆ సినిమా షూటింగ్‌కి ఆశిష్, హర్షిత్‌రెడ్డి (నిర్మాత) వచ్చేవారు. అప్పుడు వారు చిన్నపిల్లలు. ఇప్పుడు హీరో, నిర్మాతలుగా మారారు. నా బంధువుల్లో ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకుంటే ఎంతటి ఆనందం ఉంటుందో వీరిని చూస్తుంటే అంతే ఆనందంగా ఉంది. నేను ఈరోజు ఊరెళ్లాలి.. కానీ దిల్‌రాజు గారితో నా జర్నీ గుర్తొచ్చి ఈ వేడుకకు వచ్చా. హీరోగా పరిచయమవుతున్న ఆశిష్‌కి నా సపోర్ట్ ఇవ్వాలని హాజరయ్యా. ఇది నా బాధ్యత’’ అని తెలిపారు.
ఇవీ చదవండి
Advertisement