Allu Arjun: ఐకాన్‌స్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్.. వైల్డ్ కాంబో ఫిక్స్
కథానాయకుడు అల్లు అర్జున్(Allu Arjun)కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఆయన త్వరలో ఓ క్రేజీ దర్శకుడితో సినిమా చేయనున్నారు.
హైదరాబాద్: తెలుగు సినీ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఓ క్రేజీ కాంబో ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy) దర్శకుడిగా ఓ సినిమా ఖరారైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై ఇది రూపుదిద్దుకోనుంది. భూషణ్ కుమార్ నిర్మాత. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం టీ సిరీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనిపై సినీ ప్రియులు, ముఖ్యంగా ఐకాన్‌స్టార్ అభిమానులు ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. అయితే, ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలు కానుంది, ఇందులో నటించే ఇతర నటీనటులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
బన్నీ (Allu Arjun) ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని ‘పుష్ప -2’ (Pushpa 2) పైనే పెట్టారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆయన ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ మొదలైంది. మరోవైపు, సందీప్ రెడ్డి.. రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్‌లుక్ విడుదలైంది. రణ్‌బీర్‌ని వైల్డ్ లుక్‌లో చూసి బీటౌన్ వాసులు ఆశ్చర్యపోయారు. ఇక, ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సక్సెస్ తర్వాత సందీప్ - బన్నీ కాంబోలో సినిమా వస్తే చూడాలని టాలీవుడ్ ప్రేమికులు కోరుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shakuntalam: అప్పటి నుంచే నా సినిమాల్లో నిజమైన బంగారు ఆభరణాలు వాడుతున్నా: గుణశేఖర్
-
Politics News
Revanth Reddy: లీకేజీ వ్యవహారం.. కేటీఆర్ నుంచి ఎందుకు సమాచారాన్ని సేకరించలేదు?: రేవంత్ రెడ్డి
-
Sports News
On This Day: ఆ ఓటమికి సరిగ్గా 20 ఏళ్లు.. ప్రతి భారతీయుడి గుండె పగిలిన రోజు
-
Politics News
Rahul Gandhi: మమ్మల్ని అంతం చేసే కుట్రే..! రాహుల్‌కు శిక్షపై ప్రతిపక్షాల మండిపాటు
-
India News
AAP Vs BJP: దేశ రాజధానిలో ‘పోస్టర్’ వార్..!
-
Movies News
Nani: ఓ దర్శకుడు అందరి ముందు నన్ను అవమానించాడు: నాని