Alluarjun: భార్య పుట్టినరోజుకి స్పెషల్‌ విషెస్‌ చెప్పిన బన్నీ..!

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే యంగ్‌ హీరోల్లో అల్లుఅర్జున్‌ ఒకరు. సినిమా అప్‌డేట్స్‌, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. ఈరోజు ఆయన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌ విషెస్ చెప్పారు.

Published : 29 Sep 2022 12:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే యంగ్‌ హీరోల్లో అల్లు అర్జున్‌ ఒకరు. సినిమా అప్‌డేట్స్‌, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. ఈరోజు ఆయన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌ విషెస్ చెప్పారు. కేక్‌కట్ చేస్తున్న ఫ్యామిలీ ఫొటోను షేర్‌ చేస్తూ ‘‘హ్యాపీ బర్త్‌ డే క్యూటీ’’ అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరలవుతోంది. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న బన్నీ-స్నేహా 2011లో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ ‘పుష్ప:ది రూల్‌’లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘పుష్ప: ది రైజ్‌’కు సీక్వెల్‌గా వస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts