Pushpa The Rule: ‘పుష్ప2’ అక్కడా.. ఇక్కడా ఒకేసారి విడుదల..
ప్రస్తుతం సినీ ప్రియులు ‘పుష్ప2’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త ఆసక్తిరేకెత్తిస్తోంది.
హైదరాబాద్: పుష్ప టీం ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్‌తో బీజీగా ఉంది. డిసెంబర్ 8న ఈ చిత్రం రష్యాలో విడుదల సందర్భంగా బన్నీ, రష్మికలు అక్కడ సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్‌పై ఇప్పటికే అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక పుష్ప2 కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాను భారత్‌లో, రష్యాలో ఒకేసారి విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై పుష్ప సినిమా నిర్మాతల్లో ఒకరైన వై. రవిశంకర్ ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. పుష్ప ది రూల్ భారత్‌లో ఏ రోజైతే విడుదలవుతుందో అదే రోజు రష్యాలోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నామన్నారు. అంతేకాదు రష్యాతో పాటు పలు విదేశీ భాషల్లోనూ డబ్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్ సీక్వెల్‌లోనూ కొనసాగుతారని చెప్పారు. ఆయనతో పాటు మరికొందరు కొత్తవాళ్లు ఉండనున్నట్లు తెలిపారు. ఇక గతంలో ఓ సందర్భంలో అల్లుఅర్జున్ పుష్ప2 గురించి మాట్లాడుతూ ‘పుష్ప.. తగ్గేదెలే , పుష్ప2 అసలు తగ్గేదెలే’ అని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
wWBC: నిఖత్ జరీన్ పసిడి పంచ్..!
-
India News
Rahul Gandhi: ట్విటర్ బయోను మార్చిన రాహుల్
-
Politics News
Kishan Reddy: తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం: కిషన్ రెడ్డి
-
Movies News
ss karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Revanth Reddy: భాజపా నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్ రెడ్డి
-
World News
Planes Collide: తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి..!