Allu Sirish: ‘ఇడ్లీ పాక’లో టిఫిన్‌ చేసిన అల్లు శిరీష్‌

సింప్లిసిటీలో తన అన్నయ్య అల్లు అర్జున్‌ను (Allu Arjun) ఫాలో అయ్యారు నటుడు శిరీష్ (Sirish)‌. స్టార్‌ కుటుంబానికి చెందిన ఆయన చేసిన ఓ పని ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Published : 24 Oct 2022 11:11 IST

హైదరాబాద్‌: అల్లు శిరీష్‌ నటించిన కొత్త చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ షురూ చేసింది. టూర్‌లో భాగంగా ఏపీలోని పలు కళాశాలలకు  వెళ్లి.. యువతకు తమ చిత్రాన్ని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్‌ ఈవెంట్‌లో శిరీష్‌ పాల్గొన్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం.. నగరంలోని ఫేమస్‌ టిఫిన్‌ సెంటర్‌ ‘ఇడ్లీ పాక’కు వెళ్లి టిఫిన్‌ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు శిరీష్‌ సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో అతడు తన అన్నని ఫాలో అవుతున్నారని అంటున్నారు. గతంలో ‘పుష్ప’ షూట్‌ కోసం తూర్పు గోదావరి జిల్లాలో బస చేసిన బన్నీ.. రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లో టిఫిన్‌ చేసిన విషయం తెలిసిందే.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని