Alluarjun: ‘పుష్ప’ సినిమాపై బన్నీ ఆసక్తికర కామెంట్స్...!

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’‌, గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా పుష్ప మ్యానరిజం, సెప్టులు, పాటలు సోషల్‌ మీడియాలో హోరెత్తించాయి.

Published : 28 Sep 2022 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’‌, గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా పుష్ప మ్యానరిజం, సెప్టులు, పాటలు సోషల్‌ మీడియాలో హోరెత్తించాయి. ఈ సినిమాతో అల్లుఅర్జున్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.  తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ ఈ సినిమాపై స్పందిస్తూ..‘‘పుష్ప సినిమా అంత విజయం సాధిస్తుందని అసలు అనుకోలేదు. అది కచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా లేకుంటే ఇంత ప్రేమను పొందడానికి నాకు దాదాపు 20 సంవత్సరాలు పట్టేది. ‘పుష్ప: ది రూల్‌’ పై భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్టే ప్రయత్నిస్తాం’’అన్నారు. ఇటీవలే ‘పుష్ప: ది రూల్‌’ పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని