AlluArjun: పుష్పరాజ్‌ గ్రాండ్‌ పార్టీ.. ఆ 50 మందికే ఎంట్రీ

‘పుష్ప’ విజయంతో ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ (AlluArjun) ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన క్రేజ్‌ కేవలం భారత్‌కు మాత్రమే కాకుండా విదేశాలకూ పాకింది. దీంతో బన్నీ తన ఫ్రెండ్స్‌ అందరికీ గ్రాండ్‌ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు...

Published : 09 Apr 2022 11:26 IST

ఫ్రెండ్స్‌ కోసం విదేశాల్లో పార్టీ ఇచ్చిన బన్నీ 

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పుష్ప’ విజయంతో ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ (AlluArjun) ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన క్రేజ్‌ కేవలం భారత్‌కు మాత్రమే కాకుండా విదేశాలకూ పాకింది. ఈ నేపథ్యంలో బన్నీ తన ఫ్రెండ్స్‌కి గ్రాండ్‌ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం 40వ వసంతంలోకి అడుగుపెట్టిన బన్నీ.. స్నేహితులకు విదేశాల్లో ప్రత్యేక పార్టీ ఇచ్చారు. సెర్బియా, బెల్‌గ్రేడ్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో నిర్వహించిన ఈ పార్టీకి కేవలం 50 మందికి మాత్రమే ఆహ్వానం అందింది. స్నేహితుల సమక్షంలో తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి బన్నీ కేక్‌ కట్‌ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక, సినిమాల విషయానికి వస్తే ఈ టూర్‌ నుంచి వచ్చిన తర్వాత ఆయన తిరిగి సినిమా పనుల్లో బిజీ కానున్నారు. ‘పుష్ప’ విజయం తర్వాత ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘పుష్ప-2’ జూన్‌ లేదా జులైలో పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని