
AlluArjun: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లుఅర్జున్
హైదరాబాద్: కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబసభ్యుల్ని అల్లు అర్జున్ పరామర్శించారు. రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించడం కోసమే గురువారం ఉదయం బెంగళూరుకు చేరుకున్న ఆయన.. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్ ఇంటికి వెళ్లారు. పునీత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కొంతసయమంపాటు మాట్లాడారు. పునీత్‌తో తనకున్న మధురజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం దక్షిణాది చిత్రపరిశ్రమ తీరని లోటుగా మిగిలింది. పునీత్ ఆకస్మిక మరణంపట్ల సంతాపం ప్రకటిస్తూ ఇప్పటికే పలువురు తారలు ఆయన కుటుంబాన్ని కలిసి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలోనే గతేడాది బెంగళూరులో జరిగిన ‘పుష్ప’ ప్రీరిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పునీత్ తనకెంతో ఆప్తుడని.. ఆయన మరణం తనని కలచివేసిందన్నారు. ప్రీరిలీజ్ వేడుక కోసమే బెంగళూరుకి తాను వచ్చానని, ఈ సమయంలో పునీత్ కుటుంబాన్ని కలిస్తే అందరూ దీన్ని కూడా పబ్లిసిటీ అనుకుంటారని.. అందుకే తాను సమయం చూసుకుని వచ్చి కలుస్తానని అప్పట్లో చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా బెంగళూరుకు వెళ్లి పరామర్శించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- అంకురాల్లో అట్టడుగున