Alluri: ‘అల్లూరి’ ఓటీటీలోకి వచ్చేశాడు!

శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అల్లూరి’. నిజాయతీకి మారు పేరు.. అనేది ఉపశీర్షిక. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించారు. సెప్టెంబర్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా అక్టోబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

Published : 08 Oct 2022 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అల్లూరి’. నిజాయతీకి మారు పేరు.. అనేది ఉప శీర్షిక. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించారు. కయ్యదు లోహర్‌ కథానాయిక. తనికెళ్ల భరణి, మధుసూధన్‌రావు, ప్రమోదిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ప్రముఖ ఓటీటీ ఆహాలోకి వచ్చేసింది. అక్టోబర్‌ 7నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘లక్ష్యం పెట్టుకోవటం, దాన్ని సాధించటం గొప్పకాదు. లక్ష్య సాధన కోసం చేసే పోరాటం అద్భుతం’ అంటూ తనికెళ్ల భరణి.. కథానాయకుడిలో స్ఫూర్తినింపే సంభాషణలతో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.

ఇది ఒక ఫిక్షనల్‌ బయోపిక్ కథ. ఇందులో విష్ణు నిబద్ధత కలిగిన ఫోలీస్‌ అధికారి పాత్రలో కనిపిస్తాడు. సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే.. ప్రత్యర్థులు ఎంతటి వారైనా వెనక్కి తగ్గని నైజం. తేడా వస్తే పై అధికారులను కూడా లెక్కచేయని మనస్తత్వం. అక్రమార్కులను తుదముట్టించేందుకు అల్లూరి ఎన్నో మిషన్లు చేపడతాడు. అలాంటి పోలీస్ అధికారి విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? వాటిని ఎలా పరిష్కరించుకుంటాడన్నదే మిగతా కథ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని