Alluri: పోలీసంటే వ్యక్తి కాదు వ్యవస్థ.. పవర్‌ఫుల్‌గా ‘అల్లూరి’ ట్రైలర్‌

‘పోలీసంటే ఒక వ్యక్తి కాదు సర్‌ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక పోలీసు ఆఫీసర్‌ చనిపోతే ఆ స్థానంలోకి మరో పోలీసు ఆఫీసర్‌ వస్తాడు సర్‌’ అంటూ పోలీసుల పవరేంటో తెలియజేస్తున్నారు నటుడు శ్రీవిష్ణు

Updated : 07 Dec 2022 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పోలీసంటే ఒక వ్యక్తి కాదు సర్‌ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక పోలీసు ఆఫీసర్‌ చనిపోతే ఆ స్థానంలోకి మరో పోలీసు ఆఫీసర్‌ వస్తాడు సర్‌’ అంటూ పోలీసుల పవరేంటో తెలియజేస్తున్నారు నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’ (Alluri). ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురాబోతున్న నేపథ్యంలో ట్రైలర్‌ని నటుడు నాని విడుదల చేశారు. ‘లక్ష్యం పెట్టుకోవటం, దాన్ని సాధించటం గొప్పకాదు. లక్ష్య సాధన కోసం చేసే పోరాటం అద్భుతం’ అని తనికెళ్ల భరణి.. కథానాయకుడిలో స్ఫూర్తినింపే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం అలరించింది.

భరణి చెప్పిన మాటలను ఆచరణలో పెట్టిన హీరో ఏం చేశాడు? ఎంత నిజాయతీగా పనిచేశాడు? తదితర సన్నివేశాలకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ను ట్రైలర్‌లో చూపించారు. ఎ. ఎస్‌. రామరాజు పాత్రలో శ్రీవిష్ణు ఒదిగిపోయారు. ఆయన చేసిన ఈ కొత్త ప్రయత్నం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరి, అక్రమార్కులను తుదముట్టించేందుకు అల్లూరి చేపట్టిన మిషన్‌ ఏంటి? ఆ సంఘటన చూసి ఎంతమంది పోలీసులుగా మారారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫిక్షన్‌ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రదీప్‌ వర్మ దర్శకుడు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని